ముంగిలి » koodali » సుగంధి vs ఉత్సాహము పద్యముల మద్య సారూప్యతా విశ్లేషణ

సుగంధి vs ఉత్సాహము పద్యముల మద్య సారూప్యతా విశ్లేషణ

ఉత్సాహము పద్య లక్షణములు:

  1. జాతి పద్య రకానికి  చెందినది
  2. 4 పాదములు ఉండును.
  3. ప్రాస నియమం కలదు
  4. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  5. ప్రతి పాదమునందు ఏడు సూర్య గణములు, చివర ఒక గురువు ఉండును.

ఉత్సాహము పద్య లక్షణములు:

  1. వృత్త పద్యరకానికి  చెందినది
  2. అతిశక్వరి చంధానికి చెందినది
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం కలదు
  5. ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
  6. ప్రతి పాదమునందు ర , జ , ర , జ , ర గణములుండును.

క్రింది పద్యం పరిశీలిద్దాం

నిన్ను వేఁడు వార మయ్య నీరజాక్ష! మమ్ము నా
పన్నులం బ్రపన్ను లం బ్రపంచమున్దయామతిం
జెన్ను మీరఁ గావవే, ప్రసిద్ధుఁ డిద్ధకీర్తిసం
పన్నుఁ డున్ వదాన్యుఁ డుం దపస్వితుల్య తేజుఁ డున్

సుగంధి అనుకొని గణవిభజన చేస్తే

Sugandhi

అలాగే ఉత్సాహం అనుకొని గణవిభజన చేస్తే

UtsahaM

మరో పద్యం

ఇట్టు లామునీంద్రుఁ డాడి యీయ నన్న థేనువున్
బట్టి కట్టి కొంచుఁ బోవ బార్థివుండు బల్మి మైఁ
దొట్టఁ గన్ దురంతచింత దుఃఖితాత్మ యౌచు న
న్నిట్టు వాయఁగా మునీంద్రుఁ డేమి తప్పు చేసితిన్

సుగంధి అనుకొని గణవిభజన చేస్తే

Sugandhi2

అలాగే ఉత్సాహం అనుకొని గణవిభజన చేస్తే
utsahaM2

పద్యాల గణ విభజన నడక (? నాకు తెలియదు) ఆధారంగా చేయాలని అంటారు.కానీ పద్యకవులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఛందస్సు అనేది ఖచ్చితంగా Math.

పై observations ను ఆధారం చేసుకొని నేనొక సిధ్ధాంతం ప్రతిపాదిస్తున్నాను (ఇదివరకే ఉంది ఏమో తెలియదు )

ప్రతి సుగంధమూ ఉత్సాహమే కానీ ప్రతి ఉత్సాహమూ సుగంధము కాదు.

ఎందుకంటే
ర గణం = U | U
జ గణం= | U |
సుగంధానికి(ర జ ర జ ర) కావలసిన నడక (?): U|U – |U| – U|U – |U| – U|U దీనినే
ఇలా కూడా రాయ వచ్చు U| – U| – U| – U| – U| – U| -U| – U
మనకు తెలుసు U| అంటే హ గణం అంటే ఇంద్ర గణం అంటే
ఏడు హ గణాలు + గురువు లేదా ఏడు ఇంద్ర గణాలు + గురువు

Resolving యతి: సుగంధి: 9 వ అక్షరం కాగా పైన చూపించిన నడక లో 5 వ గణం మొడటి అక్షరం అనగా 4*2 (U |)=8 అక్షరాల తర్వాత మొదటి అక్షరం OR 9th అక్షరం.

ప్రాస నియమం రెండింటి కి ఎలాగూ ఉన్నాయి.

మరో ఉదాహరణ:

గజము దెరలి దాని కొఱలి కంప మొంది పాఱఁగా
భజన నింద్రుఁ డంకుశమునఁ బట్టి బిట్టు నిల్పుచున్
నిజసుధారసైకపాన నిర్ణ యార్ద్ర కరమునన్
ఋజత మీఱ నిమిఱె నదియు రీతి మెఱసి క్రమ్మఱన్.

గణ విభజనలు క్రింద ఇవ్వబడాయి.

ఉత్సాహము
utsahaM_NotSugaMdhi

సుగంధి

u_s2

కాబట్టి చివరగా చేది ప్రతి సుగంధమూ ఉత్సాహమే కానీ ప్రతి ఉత్సాహమూ సుగంధము కాదు.

All these Gana Vibhajana Reports are generated from Miriyam- A complete Telugu Chandassu Software.

Disclaimer:

Analysis made based on the output of Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections

1 thoughts on “సుగంధి vs ఉత్సాహము పద్యముల మద్య సారూప్యతా విశ్లేషణ

  1. వ్యాసం ప్రారంభంలో మీరు “సుగంధి పద్య లక్షణములు” అనవలసిన దానిని, “ఉత్సాహ పద్య లక్షణములు” అన్నారు. తర్వాత కూడా ఇదే పేరిట లక్షములనిచ్చారు. దానిని సవరించగలరు.

    మధ్యలో…హగణమంటే ఇంద్రగణమే అన్నారు. కాని, హగణమంటే సూర్యగణం. దీనిని కూడా సవరించగలరు.

    సుగంధిలో సూర్యగణాలు ఏడు ఉండాలన్నారు కాబట్టి అక్షర సంఖ్యకు విఘాతం కలుగుతుంది. ఉత్సాహంలో నిసర్గ గణాలున్నాయి కాబట్టి అక్షర సంఖ్యకు విఘాతం ఏర్పడదు. ఇంతే తేడా. నడకలో రెండూ సమాన మాత్రలతో ఉన్నా…అక్షరసంఖ్యనుబట్టి యతిమైత్రిలో తేడాలు ఉంటాయి. సాధన ద్వారా రెంటి నడకల పైనా, యతిమైత్రుల పైనా అధికారం ఏర్పడుతుంది. స్వస్తి.

వ్యాఖ్యానించండి