రమణీయమైన యునీకోడ్ ఖతులతో ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు

ఆచార్య  పి.హరిపద్మారాణి, శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం ,తిరుపతి వారు రూపొందించిన  తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు 10వేల పదాలతో  శ్రీ పెద్ది సాంబశివరావుగారు గారి సాంకేతిక సహకారంతో  pepkart.com (తెలుగు పుస్తక విక్రయశాల) ద్వారా   అందుబాటులోనికి తెచ్చారు. ముచ్చటైన అచ్చ తెలుగు  యునీకోడ్  ఖతులను మాత్రమే ఉపయోగించి డిజిటల్ ప్రింటింగునకు యునీకోడ్ ఇక ఎంతమాత్రమూ  అడ్డంకి   కాదని నిరూపించారు. వెబ్ కు మాత్రమే పరిమితమైన యునీకోడ్  ఖతులను ఉపయోగించి  ఒక అచ్చు పుస్తకమును  ముద్రించడం  తెలుగు ప్రింటింగు లో ఒక మైలు రాయి గా ఖచ్చి తముగా చెప్పవచ్చు.

ఇదే కాక వీరే( శ్రీ పెద్ది సాంబశివరావుగారు)  ప్రసిద్దమైన శంకర నారాయణ   తెలుగు నిఘంటువు కూడా  యునీకోడ్ ఖతులతోనే ముద్రించారు. ఇది ఒక కమర్షియల్ పుస్తకము కూడా.ప్రాధమిక  అంగ్ల-తెలుగు  నిఘంటువును ఉచితవుగా  pepkart.com (తెలుగు పుస్తక విక్రయశాల) నందు ఉంచారు.  మరిన్ని పుస్తకాలు ఆకర్షనీయమైన, చదవరుల కంటికి సౌకర్యమైన , ఇంపైన  రమణీయ ఖతులను ఉపయోగించి రావాలని కోరుకుంటూ.రచయితలు దీనిని ఆన్లైన్ లో  వెతకుటకు వీలుగా అందుబాటు లోని తేవాలని కోరుకుంటూ….

  1. Download Ramaneeya Telugu Unicode Fonts from Aditya Fonts (ఆదిత్యా ఫాంట్స్)
  2. Download Other Telugu Unicode  Fonts from Telugu Velugu(తెలుగు వెలుగు)
  3. Download press release on Telugu Typing Telugu Typing