నేను వ్రాసిన మొదటి కంద పద్యం

నేను వ్రాసిన మొదటి కంద పద్యం

నిన్న మా తమ్ముడు కారు కొన్న సందర్భంగా నేను ఇవాళ వ్రాసిన పద్యం . ఫేస్ బుక్కులో కామెంటు కోసమని వ్రాసుకున్న పద్యం.
దీనిలో గొప్ప భాషను కానీ గొప్ప భావం కానీ లేదు. కామెంటుగా రాద్దమనుకున్న రెండు వాక్యాలను పద్యం లా వ్రాసాను. అంతే.

దీన్ని పూర్తిగా ఛందం© (ఇదివరలో మిరియం© ) ను పద్యం Editor గా ఉపయోగించి వ్రాసాను. బహుశా పూర్తిగా గణ , యతి,ప్రాస ల గణనం ఒక machine చేస్తుండగా వ్రాసిన మొదటి పద్యం అయ్యిఉండాలి.
నా లాంటి వాడే ఎలాంటి భావావేశం లేకుండా పద్యం రాయగలిగి నప్పుడు మరి భాష మీదా,భావం మీదా పట్టు వున్న వాళ్ళు ఇంకెంత బాగా రాయెచ్చో కదా?

నాకు అనిపిస్తోంది. ఎవరో కావాలని పద్యం సాహిత్యానికి చీడ పట్టించారూ అనీ.

ఇక పోతే నేను వ్రాసిన కందం:

కారట స్కోడా కారట
అర్జునుకొనెనంట, తెచ్చెఇంటికి నిన్నే
సిల్వర్ కలరుట దానిది
టార్గెట్ మోడలుట, ఎక్కడట? నా పార్టీ?

కారట స్కోడా కారట
అర్జునుకొనెనంట, తెచ్చెఇంటికి నిన్నే
సిల్వర్ కలరుట దానిది
టార్గెట్ మోడలుట, ఎక్కడట? నా పార్టీ?

1512554_10152201812974744_920213964_n

car

కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

సరిగమపదనిస లు మాత్రమే ఉపయోగించి Auto Generate చేయబడిన తొట్టతొలి తెలుగు పద్యం.

తెలుగు కవులు దీన్ని చెత్త ప్రయోగం అనుకోవచ్చు (అంత ఎందుకు ఈ క్షణం లో మీరు కూడా ) కానీ ఇది ఒక గొప్ప ప్రయోగం అని నేను అంటాను.

ఇక మీ ఇష్టం. ఇలాంటివి లక్షల కొద్ది (ప్రస్తుతానికి కందం మాత్రమే)ఇప్పుడు మిరియం తయారు చేయగలదు.

దీన్ని .Music Format లోకి .mp3 గా మార్చి అంతరిక్షం లోకి వదిలితే ఏమో గ్రహాంత్రవాసుల అచూకీ ఏమైనా తెలుస్తుందో లేకా రెహమానుకు కాలెండరు ఖాళీ అయి పోయూ నేను బిజీ అయిపోతానో ఎవరికి తెలుసు.

తెలియక పోతే చూస్తూ ఉండండి
తెలిస్తే నవ్వుకోండి.

——————————
గానీ గసమగ సాసా
పనీద పానిస పరీప పసగా రినిదా
గానీ దపమగ రిరిరీ
మానీ గాదా మగామ మాసా దామా

——————

గదమా మమాప రిదనీ
సాదద గదరీ ససాని సారీ నీపా
దాదా గగదా పదరిప
దదగా గాదా నీగప దదనిమ పానీ

 

K

సరిదిద్దవలసిన పద్య లక్షణం: చంద్రశ్రీ

సరిదిద్దవసిన పద్య లక్షణం: చంద్రశ్రీ
అంతర్జాలం లో అందుబాటులో ఉన్న చంద్రశ్రీ పద్యలక్షణములను అనుసరించి యతి స్థానం 11 వ అక్షరంగా ఉంది కానీ అనంతుని ఛందం లో ని ఉదాహరణ పద్యం ను గణించినపుడు యతి స్థానం 12 గా తోస్తోంది. ప్రస్తుతానికి మిరియం© లో యతిస్థానాన్ని 12 గా మారుస్తున్నాను. ఎవరైనా యతి స్థానాన్ని సరి చూసి చెప్పగలరు.
లేదా

Special యతి ఏమైనా 11 వ అక్షరంవద్ద క్రింద పద్యానికి వర్తిస్తోంది ఏమో చెప్పగలరు.
నాకు యతిమైత్రి లెక్క చూడడం లో అంత Expertise లేదు.

కేవలం ఒకే ఒక పద్యం అందుబాటు లో ఉండడం వల్ల నేను ఏమీ చేయని పరిస్థితి.

పద్య లక్షణములు:

 1. అష్టి ఛందమునకు చెందినది
 2. 4 పాదములు ఉండును.
 3. ప్రాస నియమం కలదు
 4. ప్రతి పాదమునందు 11 12 వ అక్షరము యతి స్థానము
 5. ప్రతి పాదమునందు య , మ , న , స , ర , గ గణములుండును.

ఉదాహరణ:

జగన్నాథున్‌ లక్ష్మీహృదయ జలజప్రోద్యదర్కున్‌
ఖగాధీశారూఢున్‌ సుకవిజనకల్పద్రుమంబున్‌
దగన్వర్ణింపంగా యమనసయుతంబై రగంబుల్‌
మొగిం జంద్రశ్రీకిన్నిలుచు యతి ముక్కంటినొందున్‌.

11 వ అక్షరం యతి స్థానం అనుకొంటే గణవిభజన:

ChandaraSri_11

12 వ అక్షరం యతి స్థానం అనుకొంటే గణవిభజన:
ChandraSri_12

Disclaimer:

Analysis made based on the output given by by Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. These corrections may or may not represent the Original Version.
All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections

సరిదిద్దిన పద్యం-7 (Powered : మిరియం©)

సరిదిద్దిన పద్యం-7 (Powered : మిరియం©)

గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!

Errors:
4_Errors

Correction made to Line:4

From:

షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!

To:

షితదుర్మార్గు లుగాన్ గనంబడవొ ఓ శ్రీ కాళహస్తీశ్వరా!


నాకు పాండిత్యం లేదు , తెలుగు సాహిత్యంపై పట్టు అంతకన్నా లేదు. పై పూరణం నాకు తోచిందే కాని సరైనది కాదు (99% ) ఎవరి వద్ద నైనా ముద్రిత ప్రతి ఉంటే సరి అయినది ఏంటో చూసి చెప్పగలరు

షిత దుర్మార్గులుగానఁ గానఁబడవో శ్రీకాళహస్తీశ్వరా.


Thanks to Sri Gri for providing Original Version..

——————–
So Final Version

గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షితదుర్మార్గులుగాన్ గనంబడవొ ఓ శ్రీ కాళహస్తీశ్వరా!

గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షిత దుర్మార్గులుగానఁ గానఁబడవో శ్రీకాళహస్తీశ్వరా!

4_Corrected

తాత్పర్యం:

శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ – పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును – అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది.

Refer:శ్రీ చాగంటి.నెట్

Disclaimer:

All corrections made to Padyam’s are based on the errors that were identified by Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. These corrections may or may not represent the Author’s/Original Version. All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections

సుగంధి vs ఉత్సాహము పద్యముల మద్య సారూప్యతా విశ్లేషణ

ఉత్సాహము పద్య లక్షణములు:

 1. జాతి పద్య రకానికి  చెందినది
 2. 4 పాదములు ఉండును.
 3. ప్రాస నియమం కలదు
 4. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 5. ప్రతి పాదమునందు ఏడు సూర్య గణములు, చివర ఒక గురువు ఉండును.

ఉత్సాహము పద్య లక్షణములు:

 1. వృత్త పద్యరకానికి  చెందినది
 2. అతిశక్వరి చంధానికి చెందినది
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
 6. ప్రతి పాదమునందు ర , జ , ర , జ , ర గణములుండును.

క్రింది పద్యం పరిశీలిద్దాం

నిన్ను వేఁడు వార మయ్య నీరజాక్ష! మమ్ము నా
పన్నులం బ్రపన్ను లం బ్రపంచమున్దయామతిం
జెన్ను మీరఁ గావవే, ప్రసిద్ధుఁ డిద్ధకీర్తిసం
పన్నుఁ డున్ వదాన్యుఁ డుం దపస్వితుల్య తేజుఁ డున్

సుగంధి అనుకొని గణవిభజన చేస్తే

Sugandhi

అలాగే ఉత్సాహం అనుకొని గణవిభజన చేస్తే

UtsahaM

మరో పద్యం

ఇట్టు లామునీంద్రుఁ డాడి యీయ నన్న థేనువున్
బట్టి కట్టి కొంచుఁ బోవ బార్థివుండు బల్మి మైఁ
దొట్టఁ గన్ దురంతచింత దుఃఖితాత్మ యౌచు న
న్నిట్టు వాయఁగా మునీంద్రుఁ డేమి తప్పు చేసితిన్

సుగంధి అనుకొని గణవిభజన చేస్తే

Sugandhi2

అలాగే ఉత్సాహం అనుకొని గణవిభజన చేస్తే
utsahaM2

పద్యాల గణ విభజన నడక (? నాకు తెలియదు) ఆధారంగా చేయాలని అంటారు.కానీ పద్యకవులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఛందస్సు అనేది ఖచ్చితంగా Math.

పై observations ను ఆధారం చేసుకొని నేనొక సిధ్ధాంతం ప్రతిపాదిస్తున్నాను (ఇదివరకే ఉంది ఏమో తెలియదు )

ప్రతి సుగంధమూ ఉత్సాహమే కానీ ప్రతి ఉత్సాహమూ సుగంధము కాదు.

ఎందుకంటే
ర గణం = U | U
జ గణం= | U |
సుగంధానికి(ర జ ర జ ర) కావలసిన నడక (?): U|U – |U| – U|U – |U| – U|U దీనినే
ఇలా కూడా రాయ వచ్చు U| – U| – U| – U| – U| – U| -U| – U
మనకు తెలుసు U| అంటే హ గణం అంటే ఇంద్ర గణం అంటే
ఏడు హ గణాలు + గురువు లేదా ఏడు ఇంద్ర గణాలు + గురువు

Resolving యతి: సుగంధి: 9 వ అక్షరం కాగా పైన చూపించిన నడక లో 5 వ గణం మొడటి అక్షరం అనగా 4*2 (U |)=8 అక్షరాల తర్వాత మొదటి అక్షరం OR 9th అక్షరం.

ప్రాస నియమం రెండింటి కి ఎలాగూ ఉన్నాయి.

మరో ఉదాహరణ:

గజము దెరలి దాని కొఱలి కంప మొంది పాఱఁగా
భజన నింద్రుఁ డంకుశమునఁ బట్టి బిట్టు నిల్పుచున్
నిజసుధారసైకపాన నిర్ణ యార్ద్ర కరమునన్
ఋజత మీఱ నిమిఱె నదియు రీతి మెఱసి క్రమ్మఱన్.

గణ విభజనలు క్రింద ఇవ్వబడాయి.

ఉత్సాహము
utsahaM_NotSugaMdhi

సుగంధి

u_s2

కాబట్టి చివరగా చేది ప్రతి సుగంధమూ ఉత్సాహమే కానీ ప్రతి ఉత్సాహమూ సుగంధము కాదు.

All these Gana Vibhajana Reports are generated from Miriyam- A complete Telugu Chandassu Software.

Disclaimer:

Analysis made based on the output of Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections