గౌరవం

తీరు మంచిదైన గౌరవంబొనగూడు!
గౌరవమున తొలగు కష్టములును!
గుణముచెడ్డదైన గణన కెక్కుట యెట్లు?
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

గుణం

కరచుకుక్క రాను అరవదు తరుచుగా

మొరుగుకుక్క తరచు కరవబోదు

కరచి అరుచు వారు నరులయందున్నారు!
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

గర్వం

సిరులు,వాహనములు జీవనోపాదులు
కలవు తనకటంచు గర్వమేల?
గర్వమున్న వాడు సర్వనాశనమగు
భావరత్న బాల! భాగ్యలీల !
స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

క్రమశిక్షణ-రత్నాల బాల

గారబమున కంటె క్రమశిక్షణతోనె
పితురులెల్ల సుతుల బెంచునపుడు
ముసలితనమునందు బుధ్ధిగా చూతురు!
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

ఋణం-రత్నాల బాల

ఋణము చేయరాదు గుణశూన్యుదగ్గర

వైర మొందరాదు వీరుతోడ

ఋణము,రణము కన్న వ్రణములే నయమగు
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి