నేను – నా తెలుగు సినిమా కష్టాలు

చాలా నెలల తర్వాత హైదరాబాదు వచ్చి వెళ్ళాను. తెలుగు సినిమాను చూసి ఒక సంవత్సరం అయ్యింది.
హైదరాబాదు లో ఉన్నప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా వదలకుండా చూసేవాడిని(అఫ్ కోర్స్ ఇప్పుడు హిందీ సినిమాల ను వదలడం లేదనుకోండి). ష్ప్ .. !! ఏం చేస్తాం

చూడడానికి హిందీ సినిమాలు తప్పితే ఒక్క తెలుగు సినిమా కూడా దొరకదు. కనీసం CD లు కూడా దొరకవు. మా వాడు చెప్పే పేర్లు వింటూ ఇది ఎవరిది,ఎలా ఆడింది అని

అడగుతూ కూర్చున్నా ఒక సంవత్సరం లేక పోయే సరికే ఇన్ని సినిమాలు బాకీ నా. ఇక లాభం లేదనీ ఈ సారి పట్టుపట్టి
దొరికిన ఒక పది సినిమాలు DVD ల్లో రాసాను. కానీ ధియేటర్లో మాత్రం చూసేంత టైము దొరకలేదు. వాటిలో ఆరేడు సినిమాల పేర్లు కూడా వినలేదు.
ఇపుడు వాటిని అన్నింటి నీ ఎప్పుడు చూసేద్దామా అని ఉంది. నాకు దొరికిన వాటి లో చిరంజీవి కూతురు పెళ్ళి వి, వజ్రోత్సవ CD కూడా ఉంది.
అప్పుడు అనిపించింది నేనెంత మసాలా మిస్సవ్వుతున్నానో .ఈ సినిమాలు అన్నీ ఎలా వున్నయో తరువాతి పోస్టు లో రాస్తాను(ఆల్రెడీ అందరికీ ఒక పోస్టు బాకీ అనుకోం డి.).
కొసమెరుపు: ఈసారి నాకు హైదరాబాదు రాగానే అనిపించింది ఏంటంటే ఇక్కడ అందరూ తెలుగు లో మాట్లాడతారు అని(వింత ఫీలింగు కదా).
ఒక 10,12 గంటల పాటు సగం హిందీ ,సగం తెలుగు వచ్చేది. తెలుగు వింత గా ధ్వనించింది .( కూడలి, న్యూస్ పేపర్ల RSS Feed లు లేకపోతే ఎమయ్యి పోయేవాడినో). అన్నం తినగానే ప్రాణం లేచివచ్చింది . తెలుగు చానెళ్ళు చూస్తుంటే హిందీ

పోగ్రాముల్లో కనిపించే ఆర్టిపిషియాలిటి,రిచ్ నెస్, హడావుడీ ,ఏడుపులు , చెత్త/ వెకిలి నవ్వులు లేక పోయే సరికీ కొంచం ప్రశాంతం గా అనిపించింది. కానీ డాన్సు పోగాముల్లో

క్వాలిటి లో మాత్రం మన వాళ్ళు వెనకబదే వున్నరనిపించింది.అమ్మో..!! ఈ హడావిడి ప్రపంచం లోనా నేను 2 సంవత్సరాలు ఉన్నానా అనిపించింది. ఏది ఏమైనా హైదరాబాదుని

కొత్త కోణం లో చూడగలిగాను. . ఇంకా ఎన్నాళ్ళీ సినిమా కష్టాలు హైదరాబాదు కి జెండా ఎత్తేస్తా.

నా మిషను,నా టూల్సూ

ఇవాళ నాకు కొత్త మిషను దొరికింది. కాబట్టి నా పాత మిషను సెట్టింగులు, నా టూల్సు ను Configure చేసుకోవలసి వచ్చింది. అవన్నీ ఒక లిస్టు తయారు చేసాను.

 1. MS Word-2003
 2. Open Office
 3. Mozilla
 4. WinRAR
 5. Beyond Compare
 6. Indic IME1

 1. Quick Launch –> IE,Mozilla,DeskTop,VSS,VS05,SQlManagement,BeyondComapre
 2. Language Bar –>English,Telugu IME
 3. Toolbar –> MyComputer
 4. Desktop–>No ICons On Desktop

Mozilla Settings

 1. WebDeveloper Toolbar
 2. Spell checker
 3. XSS
 4. RSS Feeds

♪మాతృదేవోభవ!! పితృదేవోభవ!!♫

♫మాతృదేవోభవ

నేను నిన్న పాండురంగడు నుండి మాతృదేవోభవ!! పితృదేవోభవ!! పాట విన్నాను. చాలా బాగుంది. మనసును కదిలించే పాట అది.

బాలు,కీరవాణి విశ్వరూపం చూపించారు. బహశా ఇది ఒక మైలురాయి కావచ్కు. పాట లో పదాలు క్లిష్టమైనవి కావు. మాటలనే పాట గా రాసారు.
ఒక కొడుకు కన్నవారిని విస్మరించి, తన తప్పును గ్రహించి పడే ఆవేదన ను బాలు అద్భుతంగా ధ్వనించారు.
ఆ పాట కు లింకు http://mdileep.googlepages.com/MatrudevobhavaPandurangadu.zip

కనీసం ఈ పాట అయినా బాలయ్య దశ మారుస్తుందేమో చూడాలి.

జయహో గూగుల్

ఆ రోజు మరెంతో దూరం లో లేదు. ఈ కింద లింకు చూడండి.
http://translate.google.co.in/translate_t?hl=en

హిందీ నుండి ఇంగ్లీషు కూ , ఇంగ్లీషు నుండి హిందీ Live Translation
http://translate.google.com/translate?hl=hi&sl=en&u=http://www.boston.com/bostonglobe/editorial_opinion/oped/articles/2008/02/22/why_obama_is_beating_hillary/?page=full
http://translate.google.com/translate?hl=hi&sl=en&u=http://www.codeproject.com/KB/recipes/VirtualCursor.aspx?display=Print
http://translate.google.com/translate?hl=hi&sl=en&u=https://mdileep.wordpress.com
మరింత విపులంగా త్వరలో


Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.brinkster.net
Blog: https://mdileep.wordpress.com