సరిదిద్దిన పద్యం-6 (Powered : మిరియం©)

ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహాఽ
కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె
న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ
శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!

Errors:

4_Errors

Correction made to Line:1

From:

ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహాఽ

To:

ఆరావం బుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధిన్మహాఽ

——————–
So Final Version

ఆరావం బుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధిన్మహాఽ
కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె
న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ
శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!

4_Corrected

తాత్పర్యం:

శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు “తారకము” అని అందురు. మరియొక నామము “నాదము”. దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు “బిందువు” అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా.
ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము “కలలు” అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు – శక్తి అను అంశములుగ చూడవలయును.
ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము.

Refer:శ్రీ చాగంటి.నెట్

Disclaimer:

All corrections made to Padyam’s are based on the errors that were identified by Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. These corrections may or may not represent the Author’s/Original Version. All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections

నేడు సరిదిద్దిన పద్యం

Today’s Corrected Padyam: Based on Miriyam(A Chandassu Software  Developed by me- Yet to be announced/Realased into public domain Chandassu Helper/Padyam Editor/Teacher or what ever you can call)
Available version on internet /Wiki

పాటెరుగని పతికొలువును
గూటంబున కెరుకపడని కోమలిరతియు
జేటెత్తజేయు చెలిమియు
నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ

It’s not a correct text as per Miriyam (See  below)

before_1

 Corrected or repaired version(of mine don’t know what was the author’s version):
2nd Line
గూటంబున కెరుకపడని కోమలిరతియు
to
గూటంబున కెరుకపడని కోమలిరతియును

So final

పాటెరుగని పతికొలువును
గూటంబున కెరుకపడని కోమలిరతియును
జేటెత్తజేయు చెలిమియు
నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ

1

Interesting :

నే టి కి ==> లె న్న గ

యతి ‘నే’ కు ‘లె ‘ కు సరిపడదు. కానీ ‘టి’ కు ‘న్న’ కు ప్రాస యతి సరి పోయింది. కాన పద్యం కు కందగణ లక్షణాలు 100% కలవు

I came to know more about ప్రాస యతి So my earlier explanation was wrong. But still don’t know how yati matched between ‘నే’ and ‘లె ‘

Update:
నట్టుల + ఎన్నగా: ‘నే’ కు ‘ ఎ ‘ కు యతి సరి పోతుంది కావున ఇది కందం 100%.

Miriyam:Can’t detect Prasa yati at this point of time.(So Excluded check yati option to generate above report.)