మన కర్తవ్యం -BombBlasts

Taken with permission from http://pradeepblog.miriyala.in/2007/08/blog-post.html
This is not my experience but Pradeep’s .

నా ఫోన్ మోగుతోంది నా నిద్రను భగ్నం చేస్తూ, సమయం చూస్తే ఉదయం పది గంటలు ఆదివారం
నిన్న రాత్రి నగరంలో ఉగ్రవాదులు సృష్టించిన విఘాతం ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు
దొరికిందే అవకాశం అంటూ నిట్టూర్పు వార్తలు,
ఎవరి అంచనాలలో వారు,
నిఘా విభాగం అసమర్దత అంటూ ఒక చానల్ వారు అంటే,
మరొక చానల్ వారు ఇదే అదను అంటూ కేవలం మా చానల్ ఆధ్వర్యం లోనే చనిపోయిన వారి ఆత్మ శాంతి అంటూ ప్రచారం,
అద్రుష్టం కొద్దీ తరవాత ఏ వర్గమూ కొట్లాటలకు దిగలేదు
ఇలా ఒక రకంగా కొంచెం హ్రుద్యమైన వార్తలు విని నిద్ర పొయానేమో, నా శాంతిని ఎవర్రా పాడు చేస్తున్నది అనుకుంటూ ఫోన్ ఎత్తా
ఫోన్ చేసింది నా చిన్ననాటి స్నేహితుడు (విశాఖపట్టణంలో ఉన్నాడు)
చాలా కంగారుగా “అత్యవసరంగా రక్తం కావాలి” అన్నాడు,
మత్తు వదిలిపోయింది, ఎవరికి ఏమయ్యిందో అని “ఏ గ్రూప్ అన్నా”
“ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళు”
అప్పుడు అర్ధం అయ్యింది వాడి ఆత్రుత, ఇక్కడ నేను శుభ్రంగా వార్తలు చూస్తూ భాద పడితే ఏమయినా ఉపయోగం ఉందా?
“నేను రెండు నెలల క్రితమే రక్తదానం చేసాను” అన్నా అమాయకంగా!!!
“నువ్వు కాకపోతే, ఎవరిని అయినా మోటివేట్ చెయ్యి” అన్నాడు

అవును నిజమే కదా!!, మనం ప్రతీ సారీ మంచి పని చెయ్యలేకపోవచ్చు, కానీ పది మంది చేసేలా చెయ్యగలిగితే?

భాదితులకు సానుభూతి వెలిబుచ్చితే సరిపోదు, వీలైనంత సాయం చెయ్యగలిగితేనే ఉపయోగం
ఏమంటారు?
(నేను ఇక్కడ చెప్పిన స్నేహితుడు భాషా పదవ తరగతితో చదువు ఆపేసాడు, వాడి ఫోన్ కాల్ తర్వాత ఒక నిమిషం ఈర్ష్య (వాడి అంత మంచిగా నేను లేనందుకు) ఒక నిమిషం గర్వం కలిగాయి (వాడు నా స్నేహితుడు అయినందుకు))

బ్లాగులనూ బ్లాక్ చేస్తున్నారు ??

బ్లాగులనూ బ్లాక్ చేస్తున్నారు ??

బ్లాగులు ఏమి పాపం చేసాయి?
a
Matrilmonial sites, files sharing sites, File Downloading బ్లాకు చేస్తే OK
కానీ

ఇప్పుడు బ్లాగులను ఆఫీసు లో చూడడం ఇంటరునెట్ పోలసీ వయోలేషను కిందకి వచ్చింది(కొన్ని కంపెనీలలో(కనీసం మా ఆఫీసులో) పాలసీ రాసింది మాత్రం .ఒక పెద్ద IT భారతీయ కంపెనీ వాళ్ళు .)

technical బ్లాగులను కూడా బ్లాకు చేసారు.ఇక కొత్త ఆర్టికల్సు ఎక్కడ చదివేది?? (శత కోటి దరిద్రాలకు అనంత కోటి వుపాయాలూ. లేక పొతే పాలసీ పేరు చెప్పీ …..చెయ్యలేరు )
ఇది ఎంత వరకూ సమంజసం ??

గౌరవం

తీరు మంచిదైన గౌరవంబొనగూడు!
గౌరవమున తొలగు కష్టములును!
గుణముచెడ్డదైన గణన కెక్కుట యెట్లు?
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

గుణం

కరచుకుక్క రాను అరవదు తరుచుగా

మొరుగుకుక్క తరచు కరవబోదు

కరచి అరుచు వారు నరులయందున్నారు!
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

గర్వం

సిరులు,వాహనములు జీవనోపాదులు
కలవు తనకటంచు గర్వమేల?
గర్వమున్న వాడు సర్వనాశనమగు
భావరత్న బాల! భాగ్యలీల !
స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి