శ్రీమంతము పాట

మల్లెల విరజాజుల సువాసనలు వెదజల్లగ
గంధ,సుగంధాల పరిమళాలు గుబాళించగ
పసుపు కుంకుమలు చిరకాలం నిలవాలని
చిరునవ్వుల సందడి తో గాజుల గలగలలు మ్రోగాలని

సీమంతవేళ సంతసము నిండగ
బోసినవ్వుల బాబు జన్మించాలని
పసిడిమేను పాపాయి పల్లవించాలని
మధుర స్వరాలు వినిపించాలని

ఈ లోకానికి రానున్న శిశువు
చిరంజీవిగా పేరుగాంచాలని
దంపతులకు
ఆనంద మకరందాలు గ్రోవించాలని

 

– శ్రీమతి వర్ధమాన లక్ష్మీ రత్నమ్మ