మిరియాల వెంకట రత్నం గారి పద్యం: అన్నవరం సత్యనారాయణ #6

మత్తకోకిల

శ్రీనంతరమేశుభర్తగ చిత్తమందునదల్చినిన్
వాయుచున్నను భక్తిగొల్చుచు బార్ధనంబిటుజేయుచున్
శ్రీనందగుసత్యదేవికిచేరి మ్రొక్కినవారు, దీ
ర్ఘాయువెందశుచిత్వమీయుచు బ్రజ్జ్వలింతువు శ్రీహరీ