మిరియం© -పూర్తి స్థాయి తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్

మిరియం గురించి

 1. తెలుగు ఛందస్సు కు ఒక పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ రూపొందించాలనే లక్ష్యం తో చేసిన ప్రయత్నం ఇది.
 2. ప్రస్తుతం 169 పద్య రకాలను గుర్తించగలదు.
 3. చరిత్ర:

  1. 2008 లో దీనికి పునాది పడింది.కానీ అప్పట్లో శార్ధూల వృత్తాన్ని మాత్రమే గుర్తించగలిగేది. దాని వల్ల పెద్ద ఉపయోగం లేదు.
  2. 2013 లో కచ్చితంగా పూర్తి చేయాలనే సంకల్పం తో 80% వరకూ పూర్తి చేయగలిగానని అనుకుంటున్నాను.
  3. ఛందస్సు నేర్చుకోవడానికి చేసిన వెతుకులాటలో ఈమధ్యనే హారం వారి application కూడా చూసాసు.నా ఉద్దేశ్యం లో అది ఒక గొప్ప మొలక.
  4. ఈ విధమైన ఒక సాఫ్టువేరులు ఇంకా ఉన్నాయేమో నాకు తెలియదు.
  5. 2008 లో నేను రాసుకున్న Core Framework ను improve చేసి మిరియం ను తయారు చేసాను.
  6. దీనిని C# పోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వ్రాయడం జరిగింది. 2008 లో నేను C# కోడ్ కు equivalent ‘Javascript’ ను Manual గా వ్రాసుకున్నాను.కానీ ఇప్పుడు Javscript ను వదిలేసి పూర్తి గా C# లో వ్రాసాను.
  7. Script Sharp ను వుపయోగించి Javascript లోకి కంపైల్ చేసాను. (Google Script Sharp for  more details)
  8. కాబట్టి నా వద్ద Server Script(dll) మరియూ Client Script(.js) రెండూ వున్నాయి. (With single package of maintainable code)
 4. ఉపయోగాలు:

  1. పాత తెలుగు పద్యాలను సరి చేసు కోవచ్చు.(See Case Study  for more Details)
  2. కొత్త పద్యాలు రాసేవాళ్ళు దీని ఒక Editor గా ఉపయోగించు కోవచ్చు.
  3. తెలియని పద్యాలు ఏ రకానికి చెందినవో కనిపెట్ట వచ్చు.
  4. పద్యం చెప్పిన రకానికి చెందినదో లేదో చెప్పవచ్చు.
  5. ఇది పద్యం లో వున్న తప్పులను ఎత్తి చూపడమే కాక ఎక్కడెక్కడ కలవో అర్ధమయ్యేలా చెబుతుంది.
  6. ఛందస్సు నేర్చుకోవచ్చు.పద్య లక్షణాలే కాకుండా ఉదాహరణలను(కనీసం 5 పద్యాలు ఉంచాలన్నది లక్ష్యం)ఉంచాను.

అంకితం:

 1. మా పెద్దనాన్నగారు డా.శ్రీ మిరియాల రామకృష్ణ(మిరా)గారికి అంకితం.
 2. మిరా కవితలు కొన్ని
 3. Google మిరియాల రామకృష్ణ
 4. బాలసాహిత్యం: దక్షిణ భారత దేశ పుస్తక అవార్డు(1965): బాలాభిరామం

Limitations

 1. సమాసపదాలను కలిపే వ్రాయాలి(అదే తెలుగు సాహిత్య సాంప్రదాయం కూడా…), అనగా ఇది మధ్యలో Space ఉంటే వేరే పదంగా గుర్తిస్తుంది. లేదా Dash(-) ను సమాస పదాల మధ్యలో ఉపయోగించాలి.
  ఉదా: విపక్షపక్షసైన్య అనే సమాసాన్ని ఇక్కడ పక్ష-సైన్య అని వ్రాయవచ్చు కానీ విపక్షపక్ష సైన్య అని వ్రాస్తే గణ విభజన సరిగ్గా జరగదు.
 2. కొన్ని సంధర్భాలలో రేఫం కు ముందున్న అక్షరం లఘువు అవుతుంది. అలాంటివి ఎలా గుర్తించాలి అన్న విషయం ఎక్కడా ఒక Standard Method దొరకలేదు. కాబట్టి అలాంటి పదాల గణ విభజన తప్పుగా ఉంటాయి.
 3. యతి,ప్రాస లను గుర్తింపులో ఇది ఇంకా మొలక మాత్రమే.
 4. ప్రాసయతి ని అసలు గుర్తించ లేదు.(ప్రస్తుతం దీనిపై పని చేస్తున్నాను)
 5. ఒక Standard way లేని వాటిని(ఉదా: రేఫం ) ఎలా గుర్తించాలో ఎవరైనా సహాయం చేయగలరు.

Credits

 1. శ్రీ ఊలపల్లి సాంబశివరావు గారు: పోతన భాగవతం లో ని పద్యాలను అన్నీ అడుగగానే ఇచ్చి, ఈ application లోని తప్పుఒప్పులను ఎత్తి చూపినందుకు.
 2. శ్రీ రాకేశ్వర్ : శ్రమ తీసుకొని Wiki లో విశేష వృతాలను ఉంచించినందుకు
 3. శ్రీ మురళీ కోరిమిళ్ళి : అదుగగానే శ్రమ తీసుకొని శ్రీ సాంబశివరావు గారి వద్ద కు తీసుకువెళ్ళి నందుకు.
 4. శ్రీ అంభరీష దర్భా: వెన్ను తట్టీ ప్రోత్సహించినందుకు
 5. చిరంజీవి ఫణి ప్రదీపు(అర్జును): ఈ ఐడియా ఇచ్చినందుకు (2008 లో)
 6. చిరంజీవి సందీపు: దీనిని టెస్టు చేసినందుకు
 7. చివరగా నా శ్రీమతి అనురాధ : నన్ను నిరంతరం నిరాశ చెందకుండా ప్రోత్సహించినందుకు.
 8. ఎందరో మహానుభావులు :అంతర్జాలం లో తెలుగు పుస్తకాలను,పద్యాలను ఉంచి నా శ్రమను తగ్గించినందుకు.

Application in Action

 1. Miriyam2
 2. Miriyam3

Case Study

 1. ఈ Web Application మాత్రమే గాక, ఒక Desktop application ను దీని అనుబంధం గా తయారు చేయడం జరిగింది.
 2. ఇది Bulk గా పద్యాలను (Excel/Xml/Text Format ల లో ) తీసుకొని తప్పులను గురించి ఒక Excel/XML/TEXT/HTML File ను Output గా ఇవ్వగలదు.
 3. దానిని Purpose based గా Distribute చేయగలను . దీనిని ఉపయోగించి తెలుగుభాగవతము లో ని 9000+ పద్యాల లోని 2000+ తప్పులను ఎక్కడెక్కడ వున్నాయో ఒక రిపోర్ట్ గా <20 నిమిషాలలో ఇచ్చింది
 4. నేను అదేవిధంగా Wiki లో వున్న 300+ పద్యాలను (శతకాలు) కూడా చెక్ చేసాను. కొన్నింటిని కరెక్ట్ కూడా చేసాను.
 5. కరెక్టు చేసినవి రోజుకు ఒక పద్యం పోస్టు చేస్తున్నాను. ఇదే బ్లాగులో
 1. Input_Excel
 2. Output_Excel
 3. Input_Xml
 4. Output_Xml

List of Poems it can Detect

  జాతులు
 1. ఉత్సాహము
 2. కందం
 3. తరువోజ
 4. త్రిపది
  అక్కరలు(జాతులు)
 1. అంతరాక్కర
 2. అల్పాక్కర
 3. మధురాక్కర
 4. మధ్యాక్కర
 5. మహాక్కర
  ద్విపదలు(జాతులు)
 1. ద్విపద
 2. ద్విపదమాలిక
 3. మంజరీ ద్విపద
  ఉప-జాతులు
 1. ఆటవెలది
 2. తేటగీతి
  సీసములు(ఉప-జాతులు)
 1. సర్వలఘుసీసము
 2. సర్వలఘుసీసము2
 3. సీసం
 4. సీసం2
  వృత్తములు
 1. ఇంద్రవజ్రము
 2. ఉత్పలమాల
 3. ఉపేంద్రవజ్రము
 4. కవిరాజ విరాజితము
 5. క్రౌంచ పదం
 6. చంపకమాల
 7. తరలము(ధృవకోకిల)
 8. తోటకము
 9. దండకము-1
 10. దండకము-2
 11. పంచామరము
 12. భుజంగ ప్రయాతము
 13. భూతిలకం
 14. మంగళమహాశ్రీ
 15. మందాక్రాంతము
 16. మత్తకోకిలము
 17. మత్తేభ విక్రీడితము
 18. మహాస్రగ్ధర
 19. మానిని
 20. మాలిని
 21. మేఘ విస్ఫూరితం
 22. లయగ్రాహి
 23. లయవిభాతి
 24. వనమయూరము
 25. వసంత తిలకము
 26. శార్దూల విక్రీడితము
 27. శ్లోకము
 28. స్రగ్ధర
 29. స్రగ్విణి
 30. స్వాగత వృత్తము
  వృత్తం(విశేషం)
 1. క్షమ(క్షప)
 2. ఖచరప్లుతము
 3. గీతాలంబనము
 4. గోవృష
 5. గౌరి
 6. చంచరీకాతతి
 7. చంచరీకాతతి2
 8. చంచరీకావళి
 9. చంద్రకళ
 10. చంద్రలేఖ
 11. చంద్రశ్రీ
 12. చంద్రిక
 13. చంద్రిక2
 14. చిత్రపదము
 15. జలంధరము
 16. జలదము
 17. జలధరమాల
 18. జలోద్ధతగతి
 19. తనుమధ్యావృత్తము
 20. తరళము
 21. తురగవల్గితవృత్తము
 22. త్వరితపదగతి
 23. దృతవిలంబితము
 24. ధృవకోకిల
 25. నది
 26. నదీప్రఘోషము
 27. నర్కుటము
 28. నవనందిని
 29. నాందీముఖి
 30. నారీ
 31. నారీప్లుతవృత్తము
 32. పాదపము
 33. పద్మకము
 34. పద్మనాభము
 35. పాలాశదళము
 36. పృథివీవృత్తము
 37. ప్రగుణ
 38. ప్రణవము
 39. ప్రభాతము
 40. ప్రమాణి
 41. ప్రమితాక్షరము
 42. ప్రహరణకలిత
 43. ప్రహరణకలిత2
 44. ప్రహర్షిణి
 45. ప్రియంవద
 46. ప్రియకాంత
 47. ఫలసదనము
 48. బంధురము
 49. బలభిన్మణి
 50. భంభరగానము
 51. భద్రకము
 52. భద్రకము2
 53. భద్రిణీవృత్తము
 54. భాస్కరవిలసితము
 55. భుజంగవిజృంభితము
 56. భుజగశిశిరుతము
 57. భూతిలకము
 58. భూనుతము
 59. మంగళమహాశ్రీ
 60. మంజుభాషిణి
 61. మందాక్రాంత
 62. మణికమలవిలసితము
 63. మణిగణనికరము
 64. మణిభూషణము
 65. మణిమాల
 66. మణిరంగము
 67. మత్త
 68. మత్త మయూరము
 69. మత్తకోకిల
 70. మత్త మయూరము
 71. మత్తహంసిని
 72. మత్తేభవిక్రీడితము
 73. మదన విలసితము
 74. మదనము
 75. మదనార్త
 76. మనోజ్ఞము
 77. మయూరసారి(మయూరభాషిణి)
 78. మలయజము
 79. మేఘవిస్ఫూర్జితము
 80. మేదిని
 81. మేలనగీతి
 82. మోహ ప్రలాపము
 83. రతి
 84. రతిప్రియవృత్తము
 85. రథోద్ధతము(నరాంతికము)
 86. రమణకము
 87. రాజహంస
 88. రుగ్మవతి
 89. రుచిరము
 90. లత
 91. లయహారి
 92. లాటీవిటము
 93. వంశము
 94. వంశస్థము
 95. వనమంజరి
 96. వసంత మంజరి
 97. వాతోర్మి
 98. వాసంతి
 99. విచిత్రము
 100. విద్యున్మాల
 101. విద్రుమలత
 102. విభూతి వృత్తము
 103. విశ్వదేవి
 104. శరభక్రీడా
 105. శార్దూలవిక్రీడితము
 106. శాలిని
 107. శిఖరిణి
 108. శుద్ధవిరాటి
 109. శ్యేని
 110. స్త్రీ
 111. శ్రీరమణము
 112. సమాని
 113. సరసాంకవృత్తము
 114. సరసిజము
 115. సాధ్వీ వృత్తము
 116. సింధురవృత్తము
 117. సింహరేఖ
 118. సుకాంతి
 119. సుందరి
 120. సుందరీ వృత్తము
 121. సుగంధి

So Where is the Link to this Application?

Bad News First

Not yet made public.

2 Good News(es)

I can send you the link via mail on request basis  for first 10 . Send me a mail : m.dileep@gmail.com

It will be announced in public domain very very soon after fixing some parts like(Prasa Yati, Enhancing Yati Detection and little testing) I’m working Please keep waiting.

So What I’m expecting from Community

Suggest some more features ,Name(Other than Miriyam) and Captions to this Application

Please send Samples  if you have any  to these poem  types especially for Rare Poem Types.

I want to add more poem types to this application so Any Poem type which is not mentioned above that you know you can  send me or comment here with the details

Contact me

 1. Email me at m.dileep@gmail.com or Call me at +91-8978559072
 2. Visit my blog at https://mdileep.wordpress.com
 3. http://miriyala.in
 4. Google: Dileep Miriyala or దిలీపు మిరియాల
 5. Facebook Dileep Miriyala

గౌరవం

తీరు మంచిదైన గౌరవంబొనగూడు!
గౌరవమున తొలగు కష్టములును!
గుణముచెడ్డదైన గణన కెక్కుట యెట్లు?
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

క్రమశిక్షణ-రత్నాల బాల

గారబమున కంటె క్రమశిక్షణతోనె
పితురులెల్ల సుతుల బెంచునపుడు
ముసలితనమునందు బుధ్ధిగా చూతురు!
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

ఋణం-రత్నాల బాల

ఋణము చేయరాదు గుణశూన్యుదగ్గర

వైర మొందరాదు వీరుతోడ

ఋణము,రణము కన్న వ్రణములే నయమగు
భావరత్న బాల! భాగ్యలీల !

స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

ఆనందం-రత్నాల బాల

ఒకరినికరు జూచి యోగ్యమౌబుధ్ధిని

పొందియున్న యెడల పోరులణగు!

ఆత్మగౌరవమున ఆనందమొనగూరు

భావరత్న బాల! భాగ్యలీల !
స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం
రత్నాల బాల శతకం నుండి

ఆకలి-రత్నాల బాల

ఆకలైన వేళ ఆకులలములైన
మెక్కుచుంద్రు బీదబిక్కి జనులు!
ఆకలుడిగినపుడు ఆకులైనను వద్దు
భావరత్న బాల! భాగ్యలీల !
స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం
రత్నాల బాల శతకం నుండి

అసహజం-రత్నాల బాల

గొప్పవారి జూచి క్రూరులు కొందరు
సహనబుధ్ధి లేక నణుగుచుంద్రు!
హంస జూచి కాకి హింసించబూనదా?
భావరత్న బాల! భాగ్యలీల !
స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం
రత్నాల బాల శతకం నుండి