ముంగిలి » koodali » నేను వ్రాసిన మొదటి కంద పద్యం

నేను వ్రాసిన మొదటి కంద పద్యం

నేను వ్రాసిన మొదటి కంద పద్యం

నిన్న మా తమ్ముడు కారు కొన్న సందర్భంగా నేను ఇవాళ వ్రాసిన పద్యం . ఫేస్ బుక్కులో కామెంటు కోసమని వ్రాసుకున్న పద్యం.
దీనిలో గొప్ప భాషను కానీ గొప్ప భావం కానీ లేదు. కామెంటుగా రాద్దమనుకున్న రెండు వాక్యాలను పద్యం లా వ్రాసాను. అంతే.

దీన్ని పూర్తిగా ఛందం© (ఇదివరలో మిరియం© ) ను పద్యం Editor గా ఉపయోగించి వ్రాసాను. బహుశా పూర్తిగా గణ , యతి,ప్రాస ల గణనం ఒక machine చేస్తుండగా వ్రాసిన మొదటి పద్యం అయ్యిఉండాలి.
నా లాంటి వాడే ఎలాంటి భావావేశం లేకుండా పద్యం రాయగలిగి నప్పుడు మరి భాష మీదా,భావం మీదా పట్టు వున్న వాళ్ళు ఇంకెంత బాగా రాయెచ్చో కదా?

నాకు అనిపిస్తోంది. ఎవరో కావాలని పద్యం సాహిత్యానికి చీడ పట్టించారూ అనీ.

ఇక పోతే నేను వ్రాసిన కందం:

కారట స్కోడా కారట
అర్జునుకొనెనంట, తెచ్చెఇంటికి నిన్నే
సిల్వర్ కలరుట దానిది
టార్గెట్ మోడలుట, ఎక్కడట? నా పార్టీ?

కారట స్కోడా కారట
అర్జునుకొనెనంట, తెచ్చెఇంటికి నిన్నే
సిల్వర్ కలరుట దానిది
టార్గెట్ మోడలుట, ఎక్కడట? నా పార్టీ?

1512554_10152201812974744_920213964_n

car

9 thoughts on “నేను వ్రాసిన మొదటి కంద పద్యం

 1. తెలియాలని మాత్రమే చెప్పుతున్నాను.
  నాలుగు పాదాల్లో ప్రాస భంగం అయింది.
  రెండవ పాదంలో యతి భంగం జరిగింది.
  నాలుగవ పాదంలోని యతి భంగాన్ని, అఖండ యతిగా అనుకొంటే … కొంత వరకు అంగీకరించవచ్చు.
  యతిప్రాసలను గూర్చి అధ్యయనం చేస్తే మంచి పద్యాలను వ్రాయగలరని భావిస్తున్నాను. నా “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” (dracharyaphaneendra.blogspot.in) బ్లాగులో పాత పోస్టులను వెదకండి. కొంతవరకు మీకు ఉపకరించవచ్చు.

  • Can you please explain?

   నాలుగు పాదాల్లో ప్రాస భంగం అయింది.
   ర,ర్జు,ల్వర్,ర్గెట్ –> అన్ని పాదాలలోనూ ‘ ర ‘ ఉంది కదా?

   రెండవ పాదంలో ‘అ ‘ కు ‘ఇం’ యతి కుదురుతుంది కదా?
   చివరి పాదంలో ‘టా కు ‘డ ‘ కు కూడా యతి కుదురుతుంది కదా?

   Actually I’m Developing a software for chandassu.

   If I’m my understanding wrong about Yati/Prasa, that will also reflect in the software. So If you have some time can you please check and provide me with inputs.? (Sent you the url via Email.)


   Dileep.M

   • మరోసారి వ్యాకరణ పుస్తకాలను పరిశీలిస్తే తెలిసింది ఏమిటంటే
    ప్రాస: ప్రాస ఒక పాదంలో సంయుక్తాక్షరం/ద్విత్వాక్షరం అయితే అన్ని పాదాల్లోనూ సంయుక్తాక్షరమే/ద్విత్వాక్షరం కావాలి.
    ప్రాస పూర్వాక్షరం కనుక గురువు అయితే అన్ని పాదాలలోనూ గురువే కావాలి.

    ఈ రెండు rules ను ప్రస్తుతానికి ఛందం Evaluate చేయకపోవడం వల్లా, ఇంకా నేను పూర్తిగా చంధం మీద ఆధారపడడం వల్ల జరిగిన తప్పన్న మాట.

    So ప్రాస మొదటి పాదం లో సంయుక్తాక్షరం/ద్విత్వాక్షరం కావాలి.

    మిగతా పాదాల్లో ఎలాగూ అన్నీ ద్విత్వాక్షరలే. కాని నాకు ఒక సందేహం ‘ల్వర్ ‘ లోని ‘ర్’ ను ప్రాసాక్షరం గా తీసుకోవచ్చా లేదా అన్నది.
    ——–
    ఇక యతి సంగతి: “అ” కు “ఇం” కు యతి కుదరదు. నేను ‘ ం’ వున్న అన్ని అచ్చులకు ఏ అచ్చు లతో అయినా యతి కుదురుతుంది అని పొరపడ్డాను. So ఛందం కూడా పొరపడింది.
    కాబట్టి Actual గా అచ్చు , అచ్చు యతి వర్గం లోని అచ్చు +”ం” ఉంటేనే యతి కుదరాలి.

    ——
    ఇక చివరి పాదం లోని ‘టా కు ‘డా ఎలా యతి కుదరదో నాకు అర్ధం కాలేదు. రెండూ హల్లులు ఒకే యతి వర్గానికి చెందినవి+ హల్లు లు కూడా. ‘ఆ , ‘ఆ’, అన్ని పుస్తకాల లోనూ ఇలాగే ఉంది.

    పై రెండు+ఒకటి=మూడు Rules ను ఛందానికి నేర్పాలి , ఇక కొత్త సంవత్సరం లో

    So నా మొదటి పద్యం ఇంకా రాయలేదన్న మాటే ..!!

 2. దిలీప్ గారు!
  ఈ క్రింది లింక్ ద్వారా గతంలో నా బ్లాగులో వివరించిన యతిప్రాసల పాఠం చూడండి. కొంత అవగాహన రావచ్చు

  .http://dracharyaphaneendra.blogspot.in/2009/04/2009_11.html

  ఇక మీరు అనుకొంటున్నట్టు – సంయుక్తాక్షర ప్రాస అంటే ఏ సంయుక్తాక్షరమైనా చెల్లదు. అచ్చంగా పై పాదంలో ఏ సంయుక్తాక్షరముంటే మిగతా పాదాల్లో కూడా అదే సంయుక్తాక్షరమే ఉండాలి.

  ర్జ.. ర్గ.. ల్వర్ .. లకు చెల్లదు.

  ర్జ .. ర్జి..ర్జొ … ర్జు … ఇలా, లేదా

  ర్గ.. ర్గు.. ర్గొ.. ఇలా!

  ఇంకా నాలుగో పాదంలో యతి గురించి అర్థం కావాలంటే మీరు అఖండ యతి గురించి అధ్యయనం చేయాలి.

  ఏమైనా ఈ రకంగా సాఫ్ట్ వేర్ డెవలప్ చేయడాన్ని మెచ్చుకోవలసిందే! అయితే తప్పులు లేకుండా చేయండి.

 3. మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదు.
  ‘ల్వర్ ‘ అనే అక్షరానికి యతి గా ఏమి కుదురుతాయి? ల్వార్, ల్వాన్, ల్వాక్. ??
  ఇలాంటి సందర్భాలలో అంటే పొల్లు ఉన్న అక్షరాలకు యతి ఎలాగా?

  అఖండ యతి గురించి , సంయుక్తాక్షర యతి గురించి తప్పకుండా చదవుతాను.

 4. ఇది చదివిన తరువాత నేను వ్రాసిన మొదటి కంద పద్యాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఆ పద్యం నాకు గుర్తున్నంత వరకూ మాడగుల నాగఫణి శర్మ గారి సహస్రావధాన సభలో ప్రేక్షకుడిగా నేను ఉన్నపుడు నాకు స్ఫురించిన పద్య మని జ్ఞాపకం. ఆ పద్యం వ్రాసిన తేదీని ఆపద్యంతో పాటే డైరీలో వ్రాసి ఉంచటం జరిగింది.
  ఆ తేదీ 16-12-1997.ఆ పద్యం ఇదీ.

  అవధాన విద్య నేర్తును
  వ్యవధానము దొరకినంత వైభవశ్రీ తోన్
  కవితా సతి సంబంధము
  భవితను నా కగును గాత ! భారతి కృపతోన్.

  ఇంతకాలం ఆ పద్యం అంతా సరిగానే ఉందనుకునే వాడిని.

  ఈరోజు ఆ పద్యాన్ని ఛందస్సుతో సరి చూద్దామనిపించి సరి చూస్తే రెండు తప్పులు కనిపించాయి.

  అప్పుడు కొద్ది పాటి మార్పులను చేసి చూసాను. మార్పులు చేసిన పద్యం ఛందంతో సరిపోయింది.

  ఆ పద్యం ఇది.

  అవధాన విద్య నేర్తున్
  వ్యవధానము దొరకినంత వైభవ శ్రీ తో
  కవితా సతి సంబంధము
  భవితను నా కగును గాత ! భారతి కృపతోన్.

  ఇక్కడ నా కానందం కలిగించే మరో విషయం ఏమిటంటే “భారతి” అనేది నా భార్య పేరు కూడా కావటం.

  పైవిధంగా పద్యాలంటే ఇష్టపడే నా లాంటి వారికి ఛందస్సును తయారు చేసి ఇచ్చిన మీకు మేం ఎలా ఋణం తీర్చుకోగలం?
  తరువాత తరువాత నేను వ్రాసిన పద్యాలను కూడా ఛందస్సుతో తైపారు చేసి చూస్తాను.

 5. అన్యాయపు సొమ్మును తిని
  అన్యాయముగా బలిసిన అధముం డొక నా
  డన్యాయమయ్యి తీరును!
  అన్యాయము మీద గెలుపు న్యాయము దగుటన్. వ్రాసిన తేది:12-5-1999.

  శ్లో.
  సుందరే సుందరీ లంకా
  సుందరే సుందరీ సీతా
  సుందరే సుందరీ కథా
  సుందరే కిన్న సుందరం?
  ఛందంతో సరిపోలిస్తే ముత్యాల సరము-2 అని వచ్చి రెండు తప్పులు కూడా చూపిస్తున్నది. దీనికి నా తెలుగు
  అనువాదం.
  సుందరమైనది లంకా
  సుందరి సీతమ్మ లోక సుందరి చూడన్
  సుందరమే కథ యంతయు
  సుందరమే కాని దేది సుందర కాండన్.

  నా ఇంకో కంద పద్యం సంస్కృత భాషను గుఱించి..

  సంస్కృత భాషను నేర్చిన
  సంస్కృతియే తెలియవచ్చు; సజ్జను లారా
  సంస్కృత భాషను నేర్వుడు
  సంస్కృతియే మనకు రక్ష సంపద యోగా!

  చితి చింతా ద్వయోర్మథ్యే
  చింతా నామ గరీయసీ
  చితా దహతి నిర్జీవం
  చింతా ప్రాణయుతం వపుః II

  దీనిని ఛందం మదరేఖగా గుర్తిస్తూ 58% సరియైనదని 4 పాదాల్లోనూ తప్పులు చూపిస్తున్నది.దీనిని ఎలా సరి చేయాలో నాకు తెలియటం లేదు.
  నా అనువాదం.

  చితి చింతల రెంటి నడుమ
  చితి కంటెను చింత యధిక చింతాకరమౌ
  చితి కాల్చును నిర్జీవిని
  చితి లేకయె కాల్చు చింత జీవము తోనే.

  శిశుర్వేత్తి పశుర్వేత్తి
  వేత్తి గాన రసం ఫణిః
  కో వేత్తి కవితా తత్త్వం
  శివో జానాతి వా నవా.

  దీనిని ఛందం తో తైపారు చేస్తే హయప్రచార రగడ అని చెప్తూ 63% సరిగా ఉన్నదని చెప్తున్నది. ఇది సంస్కృత శ్లోకం గదా! ఛందం దీనిని తెలుగు పద్యంగా ఎలా గుర్తించిందో నాకు తెలియటం లేదు. ఛందం సంస్కృత శ్లోకంగా గుర్తించాలంటే ఏమి చేయాలో నాకు తెలియటం లేదు.ధీనికి నా తెలుగు అనువాదం ఇలా ఉన్నది.

  శిశువులు పశువులు పాములు
  వశు లగుదురు గానమునకు వసుధను చూడన్
  వశమా కవితా తత్త్వము
  శశిధరునకు నైన తెలియ? శక్తులె యితరుల్?

  ప్రాయః ధనవతా మేవ
  ధన తృష్ణా గరీయసీ
  పశ్య కోటి ద్వయా సక్తం
  లక్షాయ ప్రవణం ధనుః

  దీనిని కూడా ఛందం నారాచ లేక నారాచక గా గుర్తిస్తూ 62% సరి అని చూపిస్తున్నది. నారాచ లేక నారాచకము తెలుగు ఛందస్సు అని నా అనుమానం.పై శ్లోకం విషయం లోని కామెటే ఇక్కడ కూడా. దీనికి నా అనువాదం:

  ధనవంతున కాశెక్కువ
  ధనువున కిరు దెసల కోటు లైనను నది ల
  క్షనె గురి చూచును గద, యా
  ధనవంతుడు నట్లె సేయు ధరలో చూడన్.

  యస్మిన్ దేశే న సమ్మానో
  న ప్రీతి ర్న చ భాంధవాః
  న విద్యా నాస్తి ధనికో
  న తత్ర దివసం వసేత్.
  ఈ శ్లోకం నాలుగు పంక్తులలో వ్రాస్తే ఛందం హయప్రచారరగడ అని, రెండు పంక్తులలో వ్రాస్తే ద్విరదగతి రగడగానూ గుర్తిస్తున్నది. సంస్కృత ఛందస్సుగా గుర్తించటం లేదు. దీనికి పరిష్కారం ఏమిటో చెప్పగలరు.శ్లోకాలను కూడా57% సరి అని చూపిస్తున్నది.పై కామెంటే దీనికీ వర్తిస్తుంది.దీనికి నా తెలుగు అనువాదం:

  ఎక్కడ మర్యా దుండదొ
  ఎక్కడ బంధులు హితులును విద్యయును లేవొ
  ఎక్కడ ధనికులు యుండరొ
  అక్కడ తా నుండ రాదు అర దినమైనన్.

  కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకః
  మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయః.
  ఛందంతో ఇక్కడ కూడా అదే సమస్య పునరావృత మౌతున్నది. నా అనువాదం:

  కఱ వుండదు కృషి చేసిన
  అరయగ పాపములు పోవు జపముల వలనన్
  తిరముగ మౌనము బూనిన
  వైరము, జాగ్రత వలన భయమును పోవే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s