ముంగిలి » Deram » నేను- నా విచిత్రమైన కలలు – సూర్యుడు- చంద్రుడు

నేను- నా విచిత్రమైన కలలు – సూర్యుడు- చంద్రుడు

నాకు నా కలలు కనడం ఎంతో ఇష్టం. నా కలల గురించి నేను మా తమ్ముడికి రాసిన ఈ-లేఖ తో మొదలు పెడతాను. మా ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ ఇది.

నేను:

కల -1

నిన్న(May 30 2008) రాత్రి వచ్చిన కల ..

ఒక వేసవి కాలం నాటి రాత్రి

పెంకుట్టిల్లు కొబ్బరి చెట్లు పూల మొక్కలు

పున్నమి నాటి నిండు చంద్రుడు (అంత పెద్ద చంద్రున్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదా ?? ఏమో???)

పక్కనే అటూ ఇటూ మిణుకు మిణుకు మంటున్న రెండు చుక్కలు

కిందన వెన్నెల్లో మెరుస్తున్న ఇసుక

కొంచం దూరం లో చిన్న బావి

చిన్నగా చల్లగా సంపెం గ పూల వాసన తో వీస్తున్న గాలి

ఆ రాత్రే మా ప్రయాణం

తన వ్రతం చివరి రాత్రి కూడా

అమ్మ అంది “ఈ రాత్రి ఇద్దరూ జాగారం చేస్తే ఎల్లకాలం సుఖంగా ఉంటారు” అని

పొలాల్లోంచి, కొబ్బరి తోటల్లోంచి రైలు పరుగులు పెడుతోంది

పండుగ రోజు కావడం తో అంతా ఖాళీ గా ఉంది.

బయట పైరు పై పరుచుకున్న వెన్నెల , కిటికీ లో నుండి చల్లగా గాలి , ఎదురుగా తను.

చీర కొంగు గాలికి ఎగురుతోంది.

…… తరువాత ఏమైందో

…. ఇలాంటి కలే తరచూ వస్తూవుంటుంది.

కల -2

ఆరుగురు చంద్రులు ఒకేసారి వెన్నెల కురిపిస్తున్నారు.

ఊరంతా నిద్ర పోతోంది.

అర్ధరాత్రి .. బయట మేడ పై కూర్చుని ఆలోచిస్తున్నాను.

కృష్ణ పక్షం కావడంతో చుక్కలు మాత్రమే వున్నాయి. చంద్రోదయం కావస్తోంది

ఆకాశం లో తెల్లని ఒక విమానం మేడ మీంచి వెళు తోంది (అంత చీకటి లో విమానం రంగు ఎలా కనిపించిందో తెలియదు.)

వెనక ఎవరో వున్నట్టనిపించింది. తిరిగి చూసేసరికి ఒక ఇంగ్ల్లీషు వాడు . ఎప్పుడూ చూసినట్టు లేదు. అయినా ఇంగ్లీషు వాడు

ఇక్కడికి ఎలా వచ్చాడో అర్ధం కాలేదు.అడుగుదామనుకున్నా కాని సడన్ గా వాడే అడిగేసా డు

“What is the basic principal of Hindusim ??” అని

ఇలాంటి ప్రశ్న ఎప్పుడూ ఎవరినీ నేను అడిగి నట్లు జ్ఞాపకం లేదు.

అయినా నన్ను ఈ అగంతకుడు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం ఏమిటి??

వెంటనే సమాధానం మాత్రం ఏమి చెప్పలో అర్ధం కాలేదు .

భగవద్గీత లో చెప్పిన కర్మ సిద్ధాంతం చెప్పాను.

‘మనం చేసే కర్మ ల బట్టే మనకు వచ్చే ఫలితాలు వుంటాయి ‘ అని .

వాడికి అర్ధం అయ్యిందో లేదో తెలియదు.

అర్జును:

విమానాలు సాధారణంగా తెల్లగానే ఉంటాయి.
what is basic principal of hinduism అని నన్ను చాల సార్లు అడిగావు.
మొదటి కల కన్న  రెండవ కల బాగుంది

అరుగురు చంద్రులు ఒకేసారి ఎలా ఉంటారు రా, Imagination కి అంతు ఉండాలి (బహుషా నువ్వు అంగారక గ్రహం మీధ ఉండి ఉంతావు అప్పుడు)

పున్నమి నాడు చంద్రుడి  పక్కన చుక్కలు ఎలా కనిపించాయి నీకు.

నీ imaginations wild గా పోతున్నాయి.

నేను:

కాదురా బాబు నిజంగా రెండు పెద్ద పెద్ద చుక్కలు చంద్రునికి అటూ ఇటూ నిన్న రాత్రి చూసాను OffCourse కలలో …
ఆరుగురు చంద్రుల గురించి నీకు ఇదివరకే చెప్పాను. ఆరుగురు చంద్రులని మాత్రం భూమి మీదే చూసాను.

ఇంకో విషయం ఏమిటంటే . రాత్రి కల లో వచ్చింది అమ్మ కాదు కాని ఎవరో …

ఆవిడ చెప్పింది ఇది. .. ఇవాళ ఎవరితో జాగారం చెస్తావో వాళ్ళు ఎప్పటికీ నిన్ను విడిచి పోరు అని.
అప్పుడు నేను ఇద్దరు వ్యకులని కోరుకున్నా … వాళ్ళ లో ఒకరు నువ్వైతే మరొకరు ఒక అమ్మాయి ఆ అమ్మాయి గురించి మాత్రం అడక్కు ఇప్పుడు. [నిజం రా బాబు చాలా (లా ని ఒక కిలో మీటరు లాగు ) రోజుల తర్వాత బాగా(గా ని ఒక అరకిలోమీటరు లాగు ) నిద్ర పట్టింది. ]

Actual గా నా thoughts Wild గా నే ఉంటాయి.నాకు మొహమాటం , సిగ్గు ఎక్కువ గానీ , లేకపోతే Wild Person ని చూసే వాళ్ళు మీరు అందరూ….[నమ్మావా లేదా..??] అయినా ఈ కలల్లో అంత Wild గా ఏమి అనిపించింది.??
[వాడు ఉన్న ప్లేస్ గురించి ]
సరే లే గాని రాత్రి పూట సూర్యుడు కనిపించడం ఏమిట్రా బాబు ??(విన్న విషయమే అనుకో ) . సూర్యుడు అస్తమించి ఉదయిస్తాడా?? లేకా అస్తమించేటప్పడికే రాత్రి అవుతుందా??
అసలు ఏ దిక్కు లో కనిపిస్తాడు.

అర్జును:

ఇంక ఇక్కడ సూర్యుడు,పొద్దున్న ఆరు నుంచి సాయంత్రం పది వరకు కనిపిస్తూనే ఉన్నాడు. :(
ఆ అమ్మాయి ఎవరో కానీ అద్రుష్టవంతురాలు,

నేను:

ఆ విషయం ఇదివరకే చెప్పా వు . నేను అదిగింది అది కాదు

సూర్యుడు అస్తమించి ఉదయిస్తాడా?? లేకా అస్తమించేటప్పడికే రాత్రి అవుతుందా??
అసలు ఏ దిక్కు లో కనిపిస్తాడు. ??

ఆ  అమ్మాయి కి   పెళ్ళి   ఇంకో  రెండు మూడు నెలల్లో    …

అర్జును:

ఆ అమ్మాయికి పెళ్ళి శుభాకాంక్షలు అందజేయి.
సూర్యుడు కనిపించే దిక్కును తూర్పు అంటాము, నిజానికి సూర్యోదయం, సూర్యాస్తమయం అన్న విషయాలు మనం ఉన్న ప్రదేశానికి relative.
కాబట్టి, ఒక ప్రదేశంలో ఉండి ఆలోచిస్తే సూర్యుడు అస్తమించి అయినా ఉదయించవచ్చు లేదా ఉదయించి అయినా అస్తమించవచ్చు. ఈ చక్రానికి అంతు, ఆరంభం లేదు.

నేను:

సోది అంతా చెబుతావు?? విషయం మాత్రం చెప్పవు . నువ్వు చెప్పిన సోది అంతా నాకు తెలిసిందే .

ఒకవేళ సూర్యుడు పడమరన ఉదయించినా … దాన్నే తూర్పు అనాలి టెక్నికల్ గా ప్లూటో (Name is not sure ) మీద మాత్రం పడమరన ఉదయిస్తాడు . ఎందుకంటే అది అపసవ్యం గా తిరుగుతుంది కాబట్టి. (Realtive to Earth )

అస్తమించేటప్పడికే రాత్రి అవుతుందా??
Or

సూర్యుడు అస్తమించి ఉదయిస్తాడా??

అర్జును:

రాత్రి అంటె, వెలుతురు తగ్గడం అనేది మన భావన, కాబట్టి, సూర్యుడు అస్తమిస్తేనే రాత్రి అవుతుంది.
అందరికీ తెలిసిన విషయమే, సూర్యుడు అస్తమించడు, నువ్వు చెప్పినట్టు అది భూభ్రమణంపై ఆధారపడుతుంది.

నేను:

మళ్ళీ సోది …
బాబూ సూర్యుడు అస్తమించడు కరక్టే .. నీ సోది నుండి నేనే Conclude చేస్తాను.
So నీ సూర్యుడు (అదే మీ ఊళ్ళో(అదే రా బాబూ నువ్వు ఇప్పుడు వున్న ఊళ్ళో ))
Day Span పెద్దది.
నేననుకున్నట్టు పడమరన అస్తమించిన వెంటనే తూర్పున కనిపించడు.
కానీ ఇంకో డౌటు సాయంత్రం పెద్దదా?? లేకా మధ్యాహ్నం అయ్యే టప్పడికే సాయంత్రం నాలుగు అవుతుందా??


నా ప్రశ్న కు వాడైతే సమాధానం చెప్పలేదు. మీలో ఎవరైనా చెప్పండి.

———-

ఇది వరలో నాకు వచ్చిన మరో విచిత్రమైన కల  గురించి ఇక్కడ. (ఈ  కల  నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది . )నా -మరో కల

One thought on “నేను- నా విచిత్రమైన కలలు – సూర్యుడు- చంద్రుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s