ముంగిలి » Mobiles » మొబైల్ బ్రౌజింగ్

మొబైల్ బ్రౌజింగ్

నేను మొబైల్ బ్రౌజింగ్ మూడు సంవత్సరాల నుండీ చేస్తున్నా.నేను బ్రౌజింగ్ మొదలు పెట్టినప్పుడు తెలుగు ని సపోర్ట్ చేసే మొబైల్స్ చాలా తక్కువ ఉండేవి/ అందుబాటు లో ఉండేవి కాదు.(విండోస్ మొబైల్స్ తప్పా వాటి ధర ౩౦ వేల కి తక్కువ ఉండేది కాదు.) అపట్లో మొబైల్ బ్రౌజింగు కూడా చాలా తలనొప్పి గా ఉండేది. మొబైల్ బ్రౌజర్స్ WAP సపోర్ట్ మాత్రమే ఉండేది.ఇప్పటి బ్రౌజర్లు HTML/XHTML/WAP ని కూడా చక్కగా హేండిల్ చేస్తున్నాయి. ఇది గతం.

మొబైల్స్ రేట్లు తగ్గీ, యునీకోడ్ సపోర్ట్ వల్ల తెలుగు ని మొబైల్స్ లో చూడగలుగు తున్నాము. తెలుగు లో వ్రాయగలుగు తున్నాము. ఇప్పుడు SMS కి కూడా యునీకోడ్ సపోర్ట్ ఉండడం వల్ల తెలుగు లో కూడా పంపవచ్చు. కానీ మీ మొబైల్ లో తెలుగు ఫాంటు ఉండాలి అంతే.

నేను రోజూ కూడలి ని మొబైల్ లో చదువుతాను.ఈనాడు,ఆంధ్రజ్యోతీ,దట్స్ తెలుగూ,యాహూ,రెడిఫ్ సైట్ల RSS ఫీడ్లు తో వార్తలు అప్ డేట్ చేసుకుంటాను.
ఈ-మెయిలు చెక్ చేసుకోవడం , పంపడం లాంటి వన్నీ.

ఇక బ్లాగుల విషయానికి వస్తే

 • వర్డ్ ప్రెస్ లో m.wordpress.com నుండీ బ్లాగ్ ల స్టాటస్టిక్స్ మరియూ పోస్టింగ్ చేయవచ్చు.
  m.wordpress.com
 • ఇక బ్లాగరు లో మీరు అల్రెడీ ఆటోపోస్టింగ్ కి మీ ఈ-మైయిలు సెట్ చేసి ఉంటే డైరెక్టు గా మెయిలు నుండే కొత్త పోస్ట్ మీ బ్లాగులో రెడీ.

GPRS — ఇంకా చాలా మంది కి తెలియదు.
కొన్ని బ్రౌజింగ్ టిప్స్

 • ఇమేజ్స్ ని ఆఫ్ చేయండి. (బ్యాండ్ విడ్త్ తగ్గించుకోవచ్చు.)
 • m.mowser.comలాంటి సైట్ లు ఉపయోగించుకోవచ్చు. ఇది ఇమేజ్స్ ని కూడా చాలా చక్కగా మొబలైజ్ చేసి చూపిస్తుంది.
 • ఫీడ్ల ని చదవడానికి కూడా పై సైటు ఉపయోగించుకోవచ్చు. లేదా గూగిల్ రీడర్ ని ఉపయోగించుకోవచ్చు.
 • బుక్ మార్క్స్ లేదా డైరెక్ట్ యూ.ఆర్ .ఎల్ . ని ఉపయోగించడం వల్ల సమయం వృధా కాదు.
 • మీ బ్రౌజర్ ఎంత ని సపోర్ట్ చేసినా వాప్ సైట్ ల ని లేదా మొబైల్ వెర్షన్స్ ని ఉపయోగించడానికి try చేయండి.

ఆపరేటర్ల గురించి
ఎయిర్ టెల్ లో రెండు రకాల పధకాలు ఉన్నాయి

 • నెలకూ ౯౯ (99)రూపాయలు అన్ లిమిటెడ్.
 • రోజు కూ ౧౫ (15)రూపాయలు స్పీడ్ ఎక్కువ. (మీరు అనుకునేంత కాదు.).మీ పీసీ కి కూడా కనెక్టు చేసుకోవచ్చు.

ఐడియా లో

 • ఒక్కో కేబీ కీ రెండు పైసలు -నా మెయిలు చూస్తే నాకు 20(౨౦) పైసలు ఖర్చు.(ఇమేజ్ లు లేకుండా.)
 • హచ్,బీ.ఎస్ .ఎన్. ఎల్ లో నాకు తెలియదు.

ఇప్పుడు మొబైల్ బ్రౌజర్స్ లో ఒపేరా మినీ ని మించింది లేదు.(విండోస్ మొబైల్స్ ని మినహాయిస్తే. ఇది నా అనుభవం.) ఒపేరా మినీ లో జావాస్క్రిప్ట్ కూడా చక్కగా పని చేస్తుంది.(మొబైల్ లో జావా స్క్రిప్ట్ కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.) లేఅవుట్,టేబుల్స్ ని చాలా చక్కగా చూపిస్తోంది.మొబైల్స్ కి ప్రిఫరబుల్ బ్రౌజర్.
(ఇది నా కామెంటు ఇక్కడ http://praveengarlapati.blogspot.com/2007/09/blog-post_08.html)

Telugu Mobiles

Nokia మోడల్ (సుమారు ధర)

 

 • 1110 (Rs. 1900)
 • 2310 (Rs. 3000)
 • 2610 (Rs. 3625)
 • 6030 (Rs. 3675)

Motorola also Supporting

చివరి మాట:
ఏది ఏమైనా మొబైల్ బ్రౌజింగ్ కి కొంత ఓపిక కావాలి.


Dileep.M
E-mail: m.dileep@gmail.com ,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: https://mdileep.wordpress.com

3 thoughts on “మొబైల్ బ్రౌజింగ్

 1. నెనర్లు. మళ్ళీ నెనర్లు!
  మీరు కెమర గురించి చెప్పలేదు.
  సగటున మీకు నెలకి బ్రవుజింగ్ వరకు ఏ మాత్రం ఖర్చు అవుతున్నది?
  జీ.పీ.ఆర్.ఎస్ వాటికి విడిగా వసూలు చేస్తారుకదా?

 2. నేను ఉపయోగించే మొబైలు నోకీయా వారి 6030.
  SE T230, MotoRola L7 ఇవన్నీ వుపయోగించా.
  నాకు కెమేరా ల గురించి పెద్దగా తెలియదు.
  ఖర్చు:
  నాకు రోజు కీ మూడు ,నాలుగు రూపాయలు అవుతుంది. ఇమేజ్స్ లేకుండా ఈ-ఉత్తరాలను , వార్త ల హెడ్ లైన్స్ చదువుతూ వుంటే.
  మరీ బోర్ కొట్టినప్పుడూ,ఇంటర్ నెట్ అందుబాటు లో లేనప్పుడూ ప్రపంచంతో కనెక్టెడ్ గా ఉండడానికి చాలా చక్కని పరిష్కారం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s