దిలీపు మిరియాల

‘తెలుగు’ అనే వర్గంలోని టపాలు

గుణం

In Telugu, koodali, తెలుగు, సాధారణమైనమి on నవంబరు 12, 2008 at 6:39 పూర్వాహ్నం

కరచుకుక్క రాను అరవదు తరుచుగా

మొరుగుకుక్క తరచు కరవబోదు

కరచి అరుచు వారు నరులయందున్నారు!
భావరత్న బాల! భాగ్యలీల !

-స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

గర్వం

In Telugu, koodali, తెలుగు, సాధారణమైనమి on నవంబరు 12, 2008 at 6:37 పూర్వాహ్నం

సిరులు,వాహనములు జీవనోపాదులు
కలవు తనకటంచు గర్వమేల?
గర్వమున్న వాడు సర్వనాశనమగు
భావరత్న బాల! భాగ్యలీల !
-స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం

రత్నాల బాల శతకం నుండి

ఆనందం-రత్నాల బాల

In Mira, Telugu, koodali, తెలుగు, సాధారణమైనమి on నవంబరు 8, 2008 at 5:29 అపరాహ్నం

ఒకరినికరు జూచి యోగ్యమౌబుధ్ధిని

పొందియున్న యెడల పోరులణగు!

ఆత్మగౌరవమున ఆనందమొనగూరు

భావరత్న బాల! భాగ్యలీల !
-స్వర్గీయ శ్రీ మిరియాల వెంకటరత్నం
రత్నాల బాల శతకం నుండి

ఆమె- నేను- రాత్రి

In MyExperiments, Telugu, koodali, కవిత, తెలుగు on సెప్టెంబరు 11, 2008 at 7:08 అపరాహ్నం

నేను వింటున్నాను
ఈ నగరం లో రాత్రే లేదు
ఆమె మౌనం గా ఉంది.
ఈ రాత్రి కి అంతమం అంతమే  లేదా??

తొండపాట

In Mira, తెలుగు, సాధారణమైనమి on ఆగష్టు 3, 2008 at 12:00 పూర్వాహ్నం

తొండపాట

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

తొండపాట

తీగ మీద గోడమీద

తిరుగుతోంది తొండ!

పురుగురెక్క గాలిక్రింద

పాంచుతోది తొండ!

మ్రాని మీద మేనిరంగు

మార్చుకుంది తొండ!

మెడను చాచి పైకి చూచి

మెదలకుంది తొండ!

నాల్క చాచి పురుగు దోచి

నములుతోంది తొండ!

రైలులోంచి

In Mira, తెలుగు, సాధారణమైనమి on ఆగష్టు 2, 2008 at 12:00 పూర్వాహ్నం

రైలులోంచి

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

రైలులోంచి

వేపకొమ్మల దూసుకుంటూ

ఈత మట్టల నెక్కి దిగుతూ

రైలు కిటికీ దూరి వెనుకకు

గాలి జారింది !

మదపుటేన్గుల లాంటి కొండలు

ఎలుగుబంటులలాంటి గుట్టలు

రైలు కూతను వినీ వినకే

నిలచి ఉన్నాయి.

బూమి దాచిన పంట వెతుకుతు

నడిచిపోయే రైతు నాగలి

నల్లరాళ్ళకు జంకిపోతూ

నిలచిపోయింది !

పరుగులెత్తే గిత్తదూడను

చూసి చూడక రైలు ఇంజను

గుప్పుగుప్పున పొగలు చిమ్ముతు

పారిపోతోంది.!

సూర్య బింబం

In Mira, తెలుగు, సాధారణమైనమి on ఆగష్టు 1, 2008 at 12:00 పూర్వాహ్నం

సూర్య బింబం

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

సూర్య బింబం

ఆరుగంటల వేళ పడమర

కరిగి నిలిచెను సూర్య బింబం !

ఎండలో పయనమ్ము చేయుచు

ఎఱ్ఱబడినది సూర్యబింబం !

కందిపోయిన మోము కడుగగ

కడలిలో దిగె సూర్యబింబం !

కడలి లోతుల లోన జారుచు

కలసిపోయెను సూర్యబింబం !

మకిలి చీకటి వచ్చెననియా

మాయమైనది సూర్యబింబం !

తాను వచ్చేదాక దివ్వెకు

తళుకులిచ్చెను సూర్యబింబం !

చివరకు మిగిలింది!

In Mira, తెలుగు, సాధారణమైనమి on జులై 31, 2008 at 12:00 పూర్వాహ్నం

చివరకు మిగిలింది!

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

చివరకు మిగిలింది!

తీయ మామిడి చెట్ల తోటకు

తీరుబడి అయినప్పుడ్ల

పోయి తిరగడమందు నాకేదో

హాయిగా ఉంది!

చెట్ల కొమ్మలకేసి చూస్తూ

చేతితోనే అందుకుంటూ

నీడలందే తిరిగి యింటికి

నేను పోతాను!

కొన్ని నాళ్ళకు మావి చెట్టుల

కొమ్మలన్నీ చిగురు వట్టెను!

చిగురులన్నీ ఆకులవుతూ

చెరిపివేసెన  ఎఱ్ఱ రంగును!

కొన్ని నాళ్ళకు మావిచెట్టుల

కొమ్మలన్నీ పూలు పూచెను!

మావి పివ్వులు పిందెలవుతూ

మారిపోతూ కానుపించెను!

కొన్నినాళ్ళకు పిందెలన్నీ

గుంజు నిండిన కాయలయ్యెను!

మావికాయలు దోరముగ్గుతు

మనిషి చెతికి అందిపోయెను!

చిగురుటాకుల ఎఱ్ఱరంగులు

చెరిగిపోనే లేదు నాలో!

మావిపిందెల పచ్చదనములు

మాయమే కాలేదు నాలో!

అన్నీ యివి వెన్నెలలా?

In Mira, తెలుగు, సాధారణమైనమి on జులై 29, 2008 at 5:09 అపరాహ్నం

అన్నీ యివి వెన్నెలలా?

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

అన్నీ  యివి వెన్నెలలా?

ఆకాశం ఆవుపాలు

అన్ని యివి వెన్నెలలా?

చీకటి కుంకుడు నురగలు

చిక్కనివి వెన్నెలలా?

నల్లని మబ్బుల తలలో

నవ్విన పువ్వులు కావా?

జాబిలి ఒడి లో నుండియె

జారిన బియ్యం కావా!

చుక్కలు కొట్టిన బియ్యపు

చక్కని పిండి యిదేమో !

తూరుపు పాపల పెదవుల

జారిన నవ్వులివేమో !

మిరా(మిరియాల రామకృష్ణ)  గారు తన కలల నిలయానికి  వెన్నెల అనే చక్కని పేరు పెట్టుకున్నారు.

చుక్క ఎగిరి వస్తున్నది!

In Mira, తెలుగు, సాధారణమైనమి on జులై 29, 2008 at 12:33 పూర్వాహ్నం

చుక్క ఎగిరి వస్తున్నది!

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

చుక్క ఎగిరి వస్తున్నది!

చీకటి లో దీపంలా

చెక్కిలి పై కోపంలా

అందంగా మెఱిసిందీ

అంతలోనే ఆరిందీ!

ఇంచక్కా ఎగిరిన ఓ

మంచి మిణుంగురుపురుగా!

ఎవరు తప్పిపోయారే?

ఎంతసేపు వెదికావే?

చుక్క ఎగిరివస్తున్నది

చూశావా చెల్లీ!

తళుకు లారిపోకుండా

దాద్దామా తల్లీ!

ఎవరమ్మా??

In Mira, తెలుగు, సాధారణమైనమి on జులై 27, 2008 at 10:46 అపరాహ్నం

ఎవరమ్మా??

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

ఆకాశం పై మబ్బుల కంబళి

అమ్మా ! వేశారెవరే?

ఉరుమురధముపై హోరునపోయే

పౌరులెవ్వరే అమ్మా !

మెరుపు పాములను మెల్లమెల్ల గా

లాలించేవారెవరమ్మా!

తూనీగల గాలిపటాలను

ఎగరవేసినారెవరమ్మా!

పచ్చగడ్డిపయి ఆణిముత్యములు

పారబోసినా రెవరమ్మా!

మబ్బులపై ఆ యేడురంగులను

జల్లివేసినారెవరమ్మా!

చీకటీ

In Mira, తెలుగు, సాధారణమైనమి on జులై 14, 2008 at 12:00 పూర్వాహ్నం

చీకటీ

డా.మిరియాల రామకృష్ణ

(రంగు రంగు రత్న దీపాల నుండి )

చీకటీ

ఎండలారి పోవుదాక

ఎక్కడ దాక్కుంటావే

నీవే ఒక బూచివంట

నిజమేనా చీకటీ?

నీ జడ లో చందమామ

రోజూ కనబడడేమే?

ఎక్కడ దాచావో

మా కొక్క మాటు ఇస్తావా?

నీ నీలపు చీర

నీకు ఎవరు పెట్టి పంపారే ?

ఈ చుక్కల  పరికిణి ని

ఎవరు నీకు కుట్టారే ?

ముస్తాబై వస్తేనే

ముద్దుగ నిను చూస్తానే!

వెలుగు లేక వస్తే

నిను వెక్కిరించి పోతానే !

నేను – నా తెలుగు సినిమా కష్టాలు

In Cinema, Telugu, తెలుగు, నేను, సాధారణమైనమి on మే 20, 2008 at 7:42 అపరాహ్నం

చాలా నెలల తర్వాత హైదరాబాదు వచ్చి వెళ్ళాను. తెలుగు సినిమాను చూసి ఒక సంవత్సరం అయ్యింది.
హైదరాబాదు లో ఉన్నప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా వదలకుండా చూసేవాడిని(అఫ్ కోర్స్ ఇప్పుడు హిందీ సినిమాల ను వదలడం లేదనుకోండి). ష్ప్ .. !! ఏం చేస్తాం

చూడడానికి హిందీ సినిమాలు తప్పితే ఒక్క తెలుగు సినిమా కూడా దొరకదు. కనీసం CD లు కూడా దొరకవు. మా వాడు చెప్పే పేర్లు వింటూ ఇది ఎవరిది,ఎలా ఆడింది అని

అడగుతూ కూర్చున్నా ఒక సంవత్సరం లేక పోయే సరికే ఇన్ని సినిమాలు బాకీ నా. ఇక లాభం లేదనీ ఈ సారి పట్టుపట్టి
దొరికిన ఒక పది సినిమాలు DVD ల్లో రాసాను. కానీ ధియేటర్లో మాత్రం చూసేంత టైము దొరకలేదు. వాటిలో ఆరేడు సినిమాల పేర్లు కూడా వినలేదు.
ఇపుడు వాటిని అన్నింటి నీ ఎప్పుడు చూసేద్దామా అని ఉంది. నాకు దొరికిన వాటి లో చిరంజీవి కూతురు పెళ్ళి వి, వజ్రోత్సవ CD కూడా ఉంది.
అప్పుడు అనిపించింది నేనెంత మసాలా మిస్సవ్వుతున్నానో .ఈ సినిమాలు అన్నీ ఎలా వున్నయో తరువాతి పోస్టు లో రాస్తాను(ఆల్రెడీ అందరికీ ఒక పోస్టు బాకీ అనుకోం డి.).
కొసమెరుపు: ఈసారి నాకు హైదరాబాదు రాగానే అనిపించింది ఏంటంటే ఇక్కడ అందరూ తెలుగు లో మాట్లాడతారు అని(వింత ఫీలింగు కదా).
ఒక 10,12 గంటల పాటు సగం హిందీ ,సగం తెలుగు వచ్చేది. తెలుగు వింత గా ధ్వనించింది .( కూడలి, న్యూస్ పేపర్ల RSS Feed లు లేకపోతే ఎమయ్యి పోయేవాడినో). అన్నం తినగానే ప్రాణం లేచివచ్చింది . తెలుగు చానెళ్ళు చూస్తుంటే హిందీ

పోగ్రాముల్లో కనిపించే ఆర్టిపిషియాలిటి,రిచ్ నెస్, హడావుడీ ,ఏడుపులు , చెత్త/ వెకిలి నవ్వులు లేక పోయే సరికీ కొంచం ప్రశాంతం గా అనిపించింది. కానీ డాన్సు పోగాముల్లో

క్వాలిటి లో మాత్రం మన వాళ్ళు వెనకబదే వున్నరనిపించింది.అమ్మో..!! ఈ హడావిడి ప్రపంచం లోనా నేను 2 సంవత్సరాలు ఉన్నానా అనిపించింది. ఏది ఏమైనా హైదరాబాదుని

కొత్త కోణం లో చూడగలిగాను. . ఇంకా ఎన్నాళ్ళీ సినిమా కష్టాలు హైదరాబాదు కి జెండా ఎత్తేస్తా.

ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు కు మెరుగులు (English to Telugu Dictionary)

In Announcements, Dictionary, MyExperiments, తెలుగు, నిఘంటువు on ఏప్రియల్ 10, 2008 at 7:29 అపరాహ్నం

విషయ సూచిక(Index) ను జతచేయడం జరిగింది.రోబోట్ల కోసమూ మరియు
Google define Search (ఉదా:define:happy) కోసమూ జతచేయడం జరిగింది. తెలుగు లో అర్ధాలను

Google define Search వెతక లేక పోతోంది (??). చూద్దాం నా ఈ ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో.

Exact Search ఉదా: http://mdileep.brinkster.net/eng2te.aspx?search=happy&e=e

e(e for Exact)

Like Search ఉదా: http://mdileep.brinkster.net/eng2te.aspx?search=hay

Dileep.M

mdileep.brinkster.net

తేట తెలుగు

In Mira, Telugu, తెలుగు, సాధారణమైనమి on జనవరి 5, 2008 at 2:39 అపరాహ్నం

తేట తెలుగు

డా.మిరియాల రామకృష్ణ
ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోననుండి
అమ్మ పాట పాడినట్టి భాష
తేనెవంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!
సంస్కృతంబులోని చక్కెర పాకంబు,
అరవభాషలోని అమృతరాశి,
కన్నడంబులోని కస్తూరి వాసన,
కలిసిపోయె తేట తెలుగునందు.
వేనవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయి యేండ్లనుండి విలసిల్లు నా “భాష”
దేశ భాషలందు తెలుగు లెస్స!

డా.మిరియాల రామకృష్ణ

తెలుగు ఫాంటులు – సమస్యలు, సవాళ్ళు

In Challenges, Fonts, Technical, తెలుగు, పత్రికలు on ఆగష్టు 1, 2007 at 9:22 అపరాహ్నం


తెలుగు ఫాంటులు - సమస్యలు , సవాళ్ళు

  • ASCII Fonts:

  1. వీటిని మొదటి తరం ఫాంటులు గా చెప్ప్వచ్చు ఏమో . వెబ్ లో తెలుగు/ భారతీయ భాష లు చదవడానికి పాంటులను తయారు చేసి download option ఇచ్చేవారు.

  2. తర్వాత Microsoft WEFT రిలీజ్ అయ్యాకా డౌన్ లోడ్ చెసుకోవలసిన అవసం లేకుండా dynamic fonts (.eot) ద్వారా తెలుగు ను చూపించేవారు. కాక పోతే Internet Explorer మాత్రమే దీని ని support చేస్తుంది. అందువల్ల font download ఇవ్వాల్సిన అవసరం తప్పలేదు .

  3. వీటి వల్ల ఇబ్బందులు:

    1. Content వెతకడం చాలా కష్టం.

    2. Content ఏ భాష లో వుందో చెప్పడమే కష్టం.

  • ఉదా: ఈనాడు(వీళ్ళు ఎప్పుడు unicode లో కి మారతారో . ) ,వార్త, ఆంద్రజ్యోతి , ఆంధ్రప్రభ. తెలుగు లో ఒక్క పేపరు వాళ్ళూ unicode ఉపయోగించడం లేదు. (MSN,Yahoo తప్పిస్తే . అయినా ఇవి వార్తా మాధ్యమాలే కాని వార్తా పత్రికౌ కావుగా ).

    • UniCode Fonts:

    1. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు . ఇది లేక పోతే తెలుగు పరిస్తితి వెబ్ లో ఎలా వుండేదో చెప్పనవసరం లేదు.

    • ASCII to Unicode and Vice Versa

    1. డెస్క్ టాప్ అప్లికేషన్ లు :

      1. TDIL Convertor.

  • వెబ్ అప్లికేషన్ లు:

    1. UniDes( ఇది ఒక Proxy లా పని చేస్తుంది.)

    2. పద్మ (పూర్తి గా కాదు కానీ)

      ఇక్కడ ప్రత్యేకం గా UniDes కృతజ్ఞతలు చెప్పు కోవాలి. చాలా ఫాస్టు గా UniCode కి convert చేస్తుంది.అందుకే నేను మన తెలుగు పేపర్ల ని చదవడానికి దీనిని వుపయోగిస్తాను.

    • మన ముందు వున్న ()సాధారణ ఇబ్బందులు /సవాళ్ళు :

    1. తెలుగు content ను PDF ఫైళ్ళ లో కి మార్చి నప్పుడు .

    • ఆన్ లైన్ లో dynamic గా తయారు చేసే pdf ఫైల్స్ లో కొట్టొచ్చినట్టు చూడచ్చు .

      ఉదా: GoogleDocs, iText(Java Library),iTextSharp (.Net Library),ప్రవీణ్ గారు వుపయోగించే Employees.org.

    • కాని ఎడోబ్ ఆన్ లైన్ పీడీఫ్ లో మాత్రం తెలుగు చక్కగా కనబడుతుంది.

    • ఓపెన్ ఆఫీస్ లో ఈ సమస్య లేదు.

    • iTextSharp లో కష్టపడీ హిందీ చక్కగా కనపడేలా Code ని modify చేసా. కానీ ఇంకా తెలుగు లో సమస్య అలాగే వుంది . దీని గురించి వాళ్ళ (Author’s) సమాధానం .(క్రింద )

    • ఇక్కడ ఎవరికి అయినా తెలిస్తే సహాయం చేయగలరు.

    Cont.. ... Some languages like Hindi also need ligatures,
     but up till now,nobody from India has done the effort of 
    contributing code that makes these ligatures.
    This doesn't mean iText doesn't support Hindi:
    - if you provide the characters in the right order, the text will
     render correctly- you can work around the problem using PdfGraphics2D
    ........Cont

    1. బొమ్మలలో/ చిత్రాలలో మరియూ Multimedia ఫైళ్ళ లో

    • ఉదా: Snap(ఇది కూడా dynamic ),Flash(అన్ని flash లలో ఈ సమస్య లేదు. ),.Svg

    • InkScape లో Svg ఫైల్ తయారు చేసేటప్పుడు uniJustification ఉపయోగిస్తే సమస్య లేదు.

    • విండోస్ ఆఫీస్ ౨౦౦౦ (2000) /XP లలో . ౨౦౦౦౩ (2003) లో సమస్య లేదు.

    • అప్పుడప్పుడు మన మంటనక్క లో (పరిష్కారం వీవెన్ గారి Uni Justify) . ఇది శాశ్వతం గా ౩.౦ లో పరిష్కారం కానుంది అని వీవెన్ గారు ఎప్పుడో రాసారు .

      పై సమస్య లు అన్నింటి కీ కారణం UniJustification సపోర్ట్ లేకపోవడం ఒక కారణం కావచ్చు .మరి అసలు కారణం తో పాటు గా పరిష్కారం చూపాల్సింది Font Experts .

    • ఫాంటులు తయారు చేయడానికి ల భ్య మవుతున్న సాఫ్ట్ వేర్ లు:

    1. Fonts Creator 5.6/5.5: ఇది బాగుంది ౩౦ రోజుల Evaluation పిరియడ్ తో లభ్యం.

    2. FontLab: బాగుంది కాని ఫాంటుని పూర్తి గా చెయ్యలేము . కొన్ని Glyphs తర్వాత copyRight Symbol వచ్చేస్తుంది.

    3. FontForge: OpenSource కానీ అర్దం కాలేదు నాకు. బహుశా UNIX వచ్చిన వాళ్ళు బాగా ఉపయోగించగలరు అనుకుంటా.

    • Analysis/Explore కోసం:

    1. Charmap -Explores all installed Fonts.(Run—>charmap)

    2. Private Character Editor — eudcedit. (మీ సిస్టం లెవెల్ లో ఫాంటుకి కొన్ని సింబల్స్ Add చేసుకోవచ్చు.)(Run—>Eudcedit)

    • తెలుగు లో ఫాంటులు తయారు చేయడాని కి కొన్ని చిట్కాలు :

    మొత్తం అన్నీ అక్షరాలూ తయారు చెయ్యాల్సిందే కాక పోతే ఆల్రెడీ వున్న ASCII ఫాంటులను Unicode లోకి మార్చడం ఈజీ. దానిలో మొదటి ప్రయత్నమే నాగరాజు గారు చేసారు . మనకు అందమైన బాపు రాత ,సుగుణ పేరుతో అందించారు . ఇక విషయానికి వస్తే

    • Most of the fonts are available as .ttf( Ex:EEnadu,Vaartha,AndhrajyOthy). So We can use Font creator 5.6/5.5 by doing some homework by mapping between the fonts.(Our Favorite Copy & Paste is Available so happy. By opening two fonts at a time.(Base Font say Eenadu Destination font say Pothana )).

    • If fonts are not Available as .ttf then like (Anu Fonts available as .PFM&.PFB) so convert them to .ttf by using Cross Font for Windows and continue as told above.

    కానీ కాపీ రైట్ సమస్య గురుంచి చర్చించాల్సి వుంది .

    తెలుగు ఫాంట్ వనరులు:

    1. http://ildc.gov.in/telugu/tindex.aspx

    2. -Vemana and Pothana as you know already

    3. Vasumdara font on Sourceforge.

    4. Global Unicode Fonts:

    • –Arial Uni (Copy Right) not free distributable.

    • –Akshar Font –Freely Available.

    1. Telugu non UniCode Fonts:

    • All News Papers Ex:–EEnadu,Vaartha,AndhraJyothy,AndhraPrabha

    1. DTP

    • Anu

    • మరో సైట్ లో ఫ్ర్ర్ర్ డౌన్ లోడ్ చూసా జ్ఞాపకం లేదు.(??)

    ఫాంటు లు మరీ ఎక్కువగా install చేస్తే Performance తగ్గుతుంది అంట.

    Related Things/Terms/SoftWares:

    • Tryplogy

    • Encoding(Unicode,ASCII,Big Endien)

    • Key Board Layout.( Microsoft KeyBoard Layout Creator 1.4 దీని తో మనకు నచ్చిన విధంగా కీబోర్డ్ లే అవుట్ తయారు చేసుకోవచ్చు . బాగుంది ట్రై చేయండి .WX KeyBoard Layout చేసే ప్రయత్నం లో వున్నా )

    • BashaIndia Site తప్పక చూడాలి .

    • Glyphs.

    • Font Formats:

      • .fon

      • .ttf,.otf,

      • .PFM,.PFB

      • .eot

    References:

    నాగరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో



    Dileep.M
    E-mail: m.dileep@gmail.com,
    Phone:+91- 9926 33 44 64.
    WebSite: http://mdileep.googlepages.com
    Blog: http://mdileep.wordpress.com

    తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు కోసం పయనించిన రహదారి

    In తెలుగు, నిఘంటువు on జులై 11, 2007 at 6:04 పూర్వాహ్నం

    క్షమించాలి క్రెడిట్ నాది కాదు. http://sourceforge.net/projects/tel-dictionary/ నుండి డాటాబేసు తీసుకున్నా పోస్ట్ లో రిపరెన్సు ల లో లింకు ఇచ్చాను.నేను చేసింది మాత్రం MS-Access లో కి మార్చడానికి మాత్రం ఒక ౩ గంటలు కుస్తిపడ్డాను.( మొదట SQL Server లో కి ఎక్స్ పోర్ట్ చేసాను . దానికే అంత సమయం .) ఆ తరువాత ౧౦(10) MB ఫైల్ ను అప్ లోడ్ చెయ్యడం మరో ప్రహసనం . నాలుగు సార్లు విఫలం అయ్యాకా ఐదో సారి నా సర్వర్ వప్పుకుంది. MS-Access ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోండి. ఇక  C# లో coding చెయ్యడానికి కష్టపడలేదు.(నా పనే అది కదా..). .
    కృతజ్ఞతలు.

    Dileep.M (దిలీపు మిరియాల )

    చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు

    In తెలుగు, నిఘంటువు on జులై 10, 2007 at 12:09 అపరాహ్నం


    చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు (పునర్ముద్రణం 1853 సంచిక ) ౩౧౦౦౦౦(31000) పదాలతో. ఆన్ లైన్ ఎడిషన్ ఇప్పుడు లభ్యం ఇక్కడ .
    రిఫరెన్సులు:


    Dileep.M
    E-mail: m.dileep@gmail.com,
    Phone: +91- 9926 33 44 64.
    WebSite: http://mdileep.googlepages.com
    Blog: http://mdileep.wordpress.com

    ఇక ఆగేది లేదు

    In Technical, తెలుగు on మే 22, 2007 at 11:43 పూర్వాహ్నం

    ఇక ఆగేది లేదు. యూనీకోడ్ బ్రౌజర్స్ /ఆపిరేటింగ్ సిస్టంస్ (IE6.0/XP) వచ్చాక తెలుగు ని కంప్యూటర్ లో వ్రాయడానికి మనం పయనించిన రహదారి చిత్రం

      • మొదటి తరం
          • o పద్మ - వెన్నా నాగార్జున(నాకు తెలిసి మొదటి వెబ్ ఆధారిత పనిముట్టు .)
      • రెండవ తరం
          • o లేఖిని(బాగా ప్రచారం/ఆదరణ పొందిన టూల్ ).లేఖిని ని ఆధారం చేసుకొని చాలా టూల్స్ వచ్చాయి(ఒప్పు కోవలసినది.)
      • మూడవ తరం
          • తెలుగు టెక్స్టుబాక్సు: ఈమాట వారు అనుకుంటా మొదట వుపయోగించింది.తర్వాత ఒరెమోనా వారు, తెవికీ వారు తర్వాత వుపయోగించారు.
      • పైవన్నీ వెబ్ ఆధారాలు.ఇక OS Level లో ·

    ఇవన్ని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మరోసారి మైక్రోసాఫ్ట్ కి మనం thanks(కృతజ్ఞతలు)చెప్పే సమయం వచ్చింది .మైక్రోసాఫ్ట్ ఫొనిటిక్ కీ బోర్డ్(RTS Keyboard) రిలీజ్ చేసింది.

    • కొసమెరుపు : స్వేచ్చ లైనెక్స్ వుపయోగించే వాళ్ళకి ఫొనిటిక్ కీ బోర్డ్ చిరపరిచితమే.

      ఆధారం:

    మైక్రోసాఫ్ట్ phonetic keyboard

    In Technical, తెలుగు on ఏప్రియల్ 21, 2007 at 1:58 అపరాహ్నం

    హాయ్ ఇది నేను మైక్రోసాఫ్ట్ phonetic keyboard వుపయోగించి రాస్తున్నాను.
    దాని లింకు ఇక్కడ ఇస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది.
    Link1

    or
    Link2

    డౌట్స్ వుంటే నాకు మెయిల్ చేయండి.


    Dileep.M
    http://mdileep.googlepages.com
    m.dileep@gmail.com,+91- 999 300 64 34
    MPOnline Ltd. ,http://www.mponline.gov.in

    ఈనాడు యూనీకోడ్ లో

    In RSS, ఈనాడు, తెలుగు, పత్రికలు on ఏప్రియల్ 21, 2007 at 1:55 అపరాహ్నం

    మీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఈనాడు ఇప్పుడు క్రింది సైటు లో యునీకోడ్ లో లభ్యం. ఈనాడే కాదు మిగతా తెలుగు పత్రికలు కూడా యూనీకోడ్ లో లభ్యం. వాటి RSS లు http://mdileep.wordpress.com లో చూడగలరు.
    http://uni.medhas.org


    Dileep.M
    http://mdileep.googlepages.com
    m.dileep@gmail.com,+91- 999 300 64 34
    MPOnline Ltd. ,http://ww.mponline.gov.in