చాలా నెలల తర్వాత హైదరాబాదు వచ్చి వెళ్ళాను. తెలుగు సినిమాను చూసి ఒక సంవత్సరం అయ్యింది.
హైదరాబాదు లో ఉన్నప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా వదలకుండా చూసేవాడిని(అఫ్ కోర్స్ ఇప్పుడు హిందీ సినిమాల ను వదలడం లేదనుకోండి). ష్ప్ .. !! ఏం చేస్తాం
చూడడానికి హిందీ సినిమాలు తప్పితే ఒక్క తెలుగు సినిమా కూడా దొరకదు. కనీసం CD లు కూడా దొరకవు. మా వాడు చెప్పే పేర్లు వింటూ ఇది ఎవరిది,ఎలా ఆడింది అని
అడగుతూ కూర్చున్నా ఒక సంవత్సరం లేక పోయే సరికే ఇన్ని సినిమాలు బాకీ నా. ఇక లాభం లేదనీ ఈ సారి పట్టుపట్టి
దొరికిన ఒక పది సినిమాలు DVD ల్లో రాసాను. కానీ ధియేటర్లో మాత్రం చూసేంత టైము దొరకలేదు. వాటిలో ఆరేడు సినిమాల పేర్లు కూడా వినలేదు.
ఇపుడు వాటిని అన్నింటి నీ ఎప్పుడు చూసేద్దామా అని ఉంది. నాకు దొరికిన వాటి లో చిరంజీవి కూతురు పెళ్ళి వి, వజ్రోత్సవ CD కూడా ఉంది.
అప్పుడు అనిపించింది నేనెంత మసాలా మిస్సవ్వుతున్నానో .ఈ సినిమాలు అన్నీ ఎలా వున్నయో తరువాతి పోస్టు లో రాస్తాను(ఆల్రెడీ అందరికీ ఒక పోస్టు బాకీ అనుకోం డి.).
కొసమెరుపు: ఈసారి నాకు హైదరాబాదు రాగానే అనిపించింది ఏంటంటే ఇక్కడ అందరూ తెలుగు లో మాట్లాడతారు అని(వింత ఫీలింగు కదా).
ఒక 10,12 గంటల పాటు సగం హిందీ ,సగం తెలుగు వచ్చేది. తెలుగు వింత గా ధ్వనించింది .( కూడలి, న్యూస్ పేపర్ల RSS Feed లు లేకపోతే ఎమయ్యి పోయేవాడినో). అన్నం తినగానే ప్రాణం లేచివచ్చింది . తెలుగు చానెళ్ళు చూస్తుంటే హిందీ
పోగ్రాముల్లో కనిపించే ఆర్టిపిషియాలిటి,రిచ్ నెస్, హడావుడీ ,ఏడుపులు , చెత్త/ వెకిలి నవ్వులు లేక పోయే సరికీ కొంచం ప్రశాంతం గా అనిపించింది. కానీ డాన్సు పోగాముల్లో
క్వాలిటి లో మాత్రం మన వాళ్ళు వెనకబదే వున్నరనిపించింది.అమ్మో..!! ఈ హడావిడి ప్రపంచం లోనా నేను 2 సంవత్సరాలు ఉన్నానా అనిపించింది. ఏది ఏమైనా హైదరాబాదుని
కొత్త కోణం లో చూడగలిగాను. . ఇంకా ఎన్నాళ్ళీ సినిమా కష్టాలు హైదరాబాదు కి జెండా ఎత్తేస్తా.

ఏ దేశంలో ఉంటారండి మీరు?తెలుగు సినిమాలు,సీడీలు,తెలుగు చానళ్ళు అన్ని చోట్లా వస్తున్నాయి కదా.సినిమాలు రాకపోయినా,సీడీలు దొరకకపోయినా ఇంటర్ నెట్లో బొచ్చెడు సైట్లు వున్నాయి సినిమాలు ఉచితంగా చూడడానికి.చానళ్ళయితే 10$ కడితే మా టీవీ,15$ కడితే జెమిని,తేజా మీ కంప్యూటర్లో వచ్చేస్తాయి.
వేరే ఏదో దేశం లో ఉండను లెండి. భోపాల్ లో పని చేస్తూ హాష్టల్ లో ఉంటున్నాను. తెలుగు సినిమాలు, సీడీలూ ఇక్కడ రావు గానీ దూరదర్శన్ మాత్రమే వస్తూ ఉంటుంది. ఇంటర్ నెట్ లో సైట్ల గురించి తెలుసు.అందుకే కొత్త పాట లన్నీ నా ఇపాడ్ లో వుంటాయి.సినిమాలని మాత్రం డౌన్ లోడ్ చేసుకోలేను. కానీ చెప్పాగా నావి అన్నీ ‘సినిమా’ కష్టాలని. కొచం ఫన్నీ గా , సిల్లీ గా అనిపించపవచ్చు.
Go for DTH. Sundirect or Tata Sky or Dish Tv.