దిలీపు మిరియాల

ధ్యానం —నా సందేహాలు

In Experiences, సాధారణమైనమి on నవంబరు 12, 2007 at 11:42 పూర్వాహ్నం

ధ్యానం —నా సందేహాలు
నేను ఈ మధ్య (జూలై నెల నాటి మాట) స్వామి వివేకానంద రాసిన రాజయోగం పుస్తకం చదివాను.ఇందు లో జ్ఞానం,దేవుడు,మతం,మత ప్రవక్తల గురించి,వారు జ్ఞానం పొందిన విధానం(రాజ యోగం) గురించి రాశారు. ఈ పుస్తకాన్ని చదివి అర్ధం చేసుకోవడానికి కొంచం కష్టపడ్డాను.అసలు విషయానికి వస్తే ఈ పుస్తకం చివరి అధ్యాయం లో చెప్పిన కొన్ని వాక్యాలు అమితం గా ఆకట్టు కున్నాయి.
అవి
[..] నిద్రించే ముందు వ్యక్తి ఏ స్థితి లో వుంటాడో, నిద్రించి మేల్కొన్న తర్వాత కూడా అదే స్థితి లో వుంటాడు.నిద్రించేవరకూ అతని కెంత జ్ఞానం ఉంటుందో నిద్ర తర్వాత కూడా అదే స్థితి లో ఉంటాడు.అతని జ్ఞానం ఏ మాత్రం వికసించదు. అతనికెట్టి తత్వదర్శనం కలుగదు. కానీ సమాధి ని పొందిన యోగి విషయం అలా కాదు. సమాధిలోకి వెళ్ళే ముందు అతను మూర్ఖుడై ఉంటే, సమాధి తర్వాత అతను ఋషి గా మారిపోతాడు[...]ఈ విషయం గురించి గాఢం గా అలోచించాను. సడన్ గా ఒక రాత్రి మూడింటి కి మెళుకువ వచ్చింది.సబ్ – కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చెయ్యడమే ధ్యాన స్థితి/సమాధి అన్న విషయం స్ఫురించింది.అంతే నిజంగా మొదటి సారి నేను చెప్పలేని ఆనందాన్ని పొందాను.ఆ ఆనందాన్ని ఇప్పుడు మాటల లో చెప్పలేను. ఇప్పుడు పై విషయం కూడా నా సబ్ కాన్షియస్ మైండే చెప్పింది అన్న విషయం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకు ముందు ఒక పుస్తకం లో(పేరు గుర్తు లేదు. ఇంగ్లీషు పుస్తకం అది.) సబ్ -కాన్షియస్ మైండ్ ని ఎలా ఏక్టివేట్ చేసుకొవాలి అన్న విషయం చెప్పారు. అప్పటి నుండీ సమస్యలకు పరిష్కారా లు నిద్ర లో పొందాను.

తర్వాతి రోజు నుండీ ఈ విషయం గురించి ఆలోచించిన తర్వాత నాకు వచ్చిన సందేహాలు ఇవి.
1.నిజంగానే సబ్ కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చేయడమేనా ధ్యాన స్థితి / సమాధి స్థితి అంటే??
2.ధ్యాన/సమాధి స్థితి ని పొందే మార్గ్రం ఇదేనా? (రెండిటి మధ్యా చాలా బేధం ఉండవచ్చ్చు.)
3.లేదా నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదా??

కొంత మందిని ఇదే విషయం అడిగాను. సరైన సమాధానం దొరక లేదు. ఒకాయన సబ్ – కాన్షియస్ మైండ్ నుండీ పొందే పరిష్కారాలు మాత్రం గొప్పగా వుంటాయి అని.
ఇదే పుస్తకం లో స్వామి చెప్పిన మరికొన్ని వాక్యాలు

[..] ప్రపంచం లో ని గొప్ప ప్రవక్తలంతా “మాకు లభించిన తత్వసిధ్ధాంతాలన్నీ పైనించే వచ్చాయి.” అని వారంతా అంటారు.అయితే అవి వారికి నిజం గా ఎక్కడి నుండీ ప్రాపించాయో ,వారి లో చాలా మంది కి తెలియదు.(రెక్కలతో ఎగిరి వచ్చిన దేవదూత లేదా దేవత చెప్పిందని వారు అన వచ్చు.) హేతు ప్రజ్ఞ తో గానీ,తర్కం తో గానీ తమకీ దివ్యజ్ఞానం కలుగలేదని వీరంతా ఏకీభవించవచ్చు గాక.
“వారికి ప్రాప్తించిన దివ్య జ్ఞానం హేతువాదానికి అతీతమే, అయితే ఈ జ్ఞానం అంతర్గతం నుండే వస్తున్నది.” -యోగశాస్త్రం. [..]
[..]అతీంద్ర్రీయ జ్ఞానాన్ని సాధించడమే మతం.[..]
[..]ఒక పుస్తకం లొ బ్రహ్మజ్ఞానమంతా ఉందనటం,ఈశ్వరుడిని నిందించడమే!భగవంతుడు అప్రమేయుడు,అనంతుడు అంటూనే, అతన్ని ఒక చిన్న పుస్తకం లో ఇరికించడం ఎంత అవివేకం![..]
[..]వెలుపల లేదా లోపల ఒక లక్ష్యం మీద మనసును నిలిపితే,చిత్తం ఆ లక్ష్యం లో అవిచ్చన్నంగా ఉండిపోతుంది.దీన్నే ధ్యానం అంటాం.ప్రతీదీ లేదా ఇంద్రియానుభవం లోని బాహ్యాంశాన్ని తొలగించి,అంతరాంశమైన అర్ధాన్ని మాత్రమే ధ్యానించగలిగే తీవ్ర శక్తి మనసుకు ఏర్పడితే అది సమాధి అవుతుంది.[..](ఇది సరిగ్గా అర్ధం కాలేదు.)
[..]సమాధి ని పొంధాలంటే శాస్త్రీయంగా సాధన చేయాలి.[..]

రిఫరెన్సులు:
1.రాజ యోగం-స్వామి వివేకానంద(ISBN 81-7120-744-8)
https://www.sriramakrishnamath.org/ వెబ్ సైట్ ద్వారా కూడా ఆర్డరు చేయవచ్చు.

వెల:Rs.15/- మాత్రమే.(మార్చి 2007 నాటికి)
2.Unknown Book
3.My Personal Experiences.

నా సందేహాల కు సమధానాలు దొరుకుతాయని ఆశిస్తూ
దిలీపు మిరియాల

  1. దిలాప్ గారూ. మీకే తెలీని మీ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరెలా యాక్టివేట్ చేస్తారు. బహుశా మీరు చెప్పింది నిజమైతే తప్పకుండా మీరేదో భ్రమలకి లోనై వున్నారు. వెంటనే మీకే అర్థంగాని ఆ పుస్తకాలు చదవడం, ప్రయోగాలు చేయడం మానండి. ఎందుకంటే యిటువంటివి చాలా సున్నితమైన విషయాలు. మనసు మనల్ని చిత్రాతిచిత్రమైన భావాలకు గురిచేస్తుంది. వీలుంటే ఒకసారి http://abhinayani.blogspot.com లో భావాతీతథ్యానం గురించి చదవండి. చదివి, ఆలోచించి దాని మీద వ్యాఖ్య రాయండి. నేను మీకు థ్యానానికి సంబంధించిన అన్ని సందేహాలూ తీర్చ ప్రయత్నిస్తాను.

  2. ayinaa intha alochisthunnaav kabatti okati cheptha vinu,
    I think you have already the answer to your question, but the problem is you are not identifying it.
    The answer is simple, let me correlate this way
    Take a computer, start some process… it may go in to not responding state for some time, but in the background it will continue to process till you kill it.
    Our brain is also similar. give it rest (like leaving computer some time when not responding). it will get answers some time later but it will get you.
    You feel that it is wonder, but actually when you are sleeping brian will think abt unsolved problems of your interst.

    Also take a professional athlete, every one is athlete by birth but, all don’t have perfection.
    when you can control your strength and get in to way you want, then athlete succeeds.

    Everyone knows everything, but lack of practice and concentration.

    When you concentrate on your energy, you can convert your normal sleep to dhyanam or samadhi sthithi.

    Final word for Vinjamuri gaaru,
    anthaa baane undhi, kaani problem emitante prayogaalu manandi andame baagoledhu, endhukante when man stops expermenting it is end of his life.
    chinnappudu edhi antha twaraga ardham kaadu, kaani appudu entha intrest tho nerchukunnam istamaina vaatini..
    “When Knowing some thing be a child, When expermenting it be a professional” emantaaru.
    ardham kaani daanni ardham chesukuntene kada vijayam.
    No one on this earth should accept thier defeat just because it is not understood. because everything can be correlated with everything.

    all the best my dear brother,
    confuse avvaku, concentrate cheyyi.

  3. ఇక్కడ మనకు తెలియని సబ్ కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చెయ్యవచ్చు. ఎలా అంటే ఒక విషయం గురించి నిద్ర పోయే ముందు ఆ విషయాన్ని తీవ్రంగా ఆలోచించడం ద్వారా. కానీ అన్ని సార్లూ పరిష్కారాలు దొరకకపోవచ్చు.
    కొన్ని రోజుల తర్వాత అయినా దొరకవచ్చు.ఇది నా అనుభవం లోనిదే. మీకు తెలిసే ఉంటుంది బెంజిన్ రింగ్ ను ఇలాగే ఆవిష్కరించారు. మన మైండ్/ఆలోచనలను మన ఆధీనం లో ని కి తెచ్చే ప్రయత్నంచడం లో తప్పులేదను కుంటాను.కాని మీరన్నట్టు భ్రమ లో ఉండడం తప్పే. నిజాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ పోస్టు.

  4. దిలీపు గారు, మీకు ఆసక్తి ఉంటే వేగు పంపించండి, ధ్యాన మిత్రుల ఫోన్ నెంబర్లు ఇస్తాను.

  5. [...] ఇది వరలో నాకు వచ్చిన మరో విచిత్రమైన కల  గురించి ఇక్కడ. (ఈ  కల  నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది . )నా -మరో కల [...]

  6. Every person thinks in terms of ‘I’ (ego). This ‘I’ is common for all. Many accessories with their interfaces are attached this ego. for example, body is one accessory. This is delinked when we sleep. Mind is another accessory which will be dropped in deep sleep. Our illusion (avidya or karana sharira) is another accessory which can not be manipulated by us. Perhaps, this scope of this illusion can be reduced with meditation or japam etc.

    However, the ultimate goal of dhyanam is to obtain internal clarity when we are in perfect consciousness..